Chiranjeevi New Movie: మెగాస్టార్ చిరంజీవి 68వ బర్త్ డే నేడు. 1955 ఆగస్టు 22న చిరంజీవి మొగల్తూరు గ్రామంలో వెంట్రావు, అంజనమ్మ దంపతులు జన్మించాడు. సినిమాపై మక్కువతో చెన్నై వెళ్లారు. ఆఫర్స్ కోసం అష్టకష్టాలు పడ్డారు. చిరంజీవికి ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేదు. కేవలం టాలెంట్ ని నమ్ముకున్నాడు. నటుడిగా ఎదగాలనే క్రమంలో భరత నాట్యం నేర్చుకున్నాడు. చెన్నైలో యాక్టింగ్ స్కూల్ లో చేరాడు. ఒక దశలో అవమానాలు ఎదుర్కొన్నాడు. చెన్నై పాండీ బజార్ లో ఓ దుకాణా దారుడు చిరంజీవిని చూసి… హీరో అవుదామని వచ్చావా? ఆ కలతో వేలమంది ఇక్కడి వస్తారు.
అయినా నీ ముఖానికి హీరో అవుతావా? చాలా మంది నీలాంటి వాళ్ళు కనుమరుగైపోయారని అన్నాడట. ఆ సంఘటన చిరంజీవిని ఎంతో కలచి వేసిందట. రూమ్ కి వచ్చి చాలా ఏడ్చుకున్నాడట. అయినా ఇలాంటి వ్యాఖ్యలకు లొంగకూడదు మనం ఇక్కడే ఉండాలి. అనుకున్న లక్ష్యం సాధించాలని ఫిక్స్ అయ్యాడట. ఓ సందర్భంలో ఈ విషయాన్ని చిరంజీవి స్వయంగా వెల్లడించారు.
ఇటీవల విడుదలైన భోళా శంకర్ ఘోరపరాజయం చవి చూసింది. ఈ క్రమంలో ఆయన కెరీర్లో ఎదురైన అనుభవాలు చెప్పాల్సి వచ్చింది. జయాపజయాలతో సంబంధం లేకుండా చిరంజీవి చిత్రాలు చేస్తున్నారు. ఏడాదిన్నర కాలంలో నాలుగు చిత్రాలు విడుదల చేశారు. నేడు మరో చిత్రం ప్రకటించారు. ఈ చిత్రాన్ని చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మిస్తుంది. అదే విషయాన్ని పోస్టర్ లో రివీల్ చేశారు.
అయితే దర్శకుడు ఎవరనేదీ వెల్లడించలేదు. నిజానికి సుస్మిత నిర్మాతగా కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో మూవీ అనుకున్నారు. ఇది దాదాపు కన్ఫర్మ్ అయ్యింది. అనూహ్యంగా నేడు డైరెక్టర్ పేరు లేకుండా పోస్టర్ విడుదల చేశారు. భోళా శంకర్ రిజల్ట్ నేపథ్యంలో కళ్యాణ్ కృష్ణను చిరంజీవి పక్కన పెట్టారని అంటున్నారు. ఈ వార్తలను బలపరిచేవిగా చిరంజీవి బర్త్ డే పోస్టర్ ఉంది. ఈ ప్రాజెక్ట్ కోసం మురుగదాస్ ని లైన్ లోకి తెచ్చారని అంటున్నారు.