KCR VS TDP: తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీని.. తెలుగుదేశం ఉప పార్టీగా అభివర్ణిస్తారు. అచ్చం తెలుగుదేశం పార్టీనే ఇన్నాళ్లు కెసిఆర్ అనుసరించారు.ప్రధానంగా బీసీల ద్వారా తన పార్టీని విస్తరించుకున్నారు. అయితే ఇప్పుడు వ్యూహం మార్చారు. అగ్రకులాలకే ఎక్కువ టికెట్లను కేటాయించారు. బీసీలకు గణనీయంగా తగ్గించేశారు. దీంతో తనపై ఉన్న టిడిపి ముద్ర చెరిపే ప్రయత్నం చేస్తున్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాడిన బీఆర్ఎస్ పార్టీలోనే బీసీలకు తక్కువ టిక్కెట్లు దక్కడం విమర్శలకు తావిస్తోంది.
తెలంగాణ సీఎం కేసీఆర్ బిఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించిన సంగతి తెలిసిందే. తొలి విడతలో ఒకేసారి 115 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇందులో దాదాపు సగం మంది అగ్రకులాల వారికే అవకాశం కల్పించారు. బీసీలకు 23 సీట్లకే పరిమితం చేశారు. కేవలం 5 వంతు తోనే సరి పెట్టేశారు. అటు మహిళలకు సైతం ప్రాతినిధ్యం తగ్గించారు. కేవలం ఏడుగురు మహిళలకే టిక్కెట్లు ఇచ్చారు. అయితే ఇప్పటికే మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బి ఆర్ఎస్ పోరాడుతోంది. ఇప్పుడు టిక్కెట్లు తగ్గించడంతో ముప్పేట విమర్శలను ఎదుర్కొంటుంది.
కెసిఆర్ ప్రకటించిన 115 మంది అభ్యర్థుల్లో 58 మంది ఓసి అభ్యర్థులు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వారు 40 మంది, వెలమలు 11మంది, కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు ఐదుగురు, బ్రాహ్మణులు, వైశ్యుల్లో ఒక్కొక్కరికీ చొప్పున టిక్కెట్లు ఇచ్చారు. అయితే కెసిఆర్ తీసుకున్న అనూహ్య నిర్ణయం పై విస్మయం వ్యక్తం అవుతోంది. బీసీలకు అత్యధిక సీట్లు కేటాయించాలని అన్ని పార్టీల నుంచి డిమాండ్ వినిపిస్తోంది. కానీ ఆ కేసిఆర్ మాత్రం దానిని పట్టించుకోలేదు. రాజకీయంగా, ఆర్థికంగా బలమైన ముద్ర ఉన్న అగ్రకులాలకు చెందిన అభ్యర్థుల పైపే మొగ్గు చూపారు. బి ఆర్ ఎస్ పార్టీపై ఉన్న టిడిపి ముద్రను చెరిపేసేందుకే కెసిఆర్ ఈ కఠిన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.