The Vaccine War: ‘ది కశ్మీర్ ఫైల్స్’ ద్వారా సంచలనం సృష్టించిన డైరెక్టర్ అగ్నిహోత్రి మరో ప్రయోగం చేయబోతున్న విషయం తెలిసిందే. కరోనా కాలంలో భారత్ తయారు చేసిన వ్యాక్సిన్ పై ఓ సినిమా తీశాడు. దీనికి ‘వ్యాక్సిన్ వార్’ అనే పేరు పెట్టారు. ఈ మూవీని ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 15న రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల సినిమాను వాయిదా వేస్తున్నట్లు.. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 28న థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటిపంచారు. ఈ విషయంలో ప్రేక్షకులు తనను మన్నించాని చెప్పుకొచ్చారు. ‘వ్యాక్సిన్ వార్’ సినిమా కు సంబంధించి క్లారిటీ ఇవ్వడానికి స్వయంగా ఆయనే మాట్లాడుతూ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కరోనా సమయంలో భారత ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం అతి తక్కువ ధరకు వ్యాక్సిన్ తయారు చేసిందని, ఈ నేపథ్యంలో ఎదురైన సంఘటనలను ఆధారంగా ‘వ్యాక్సిన్ వార్’ తీసినట్లు అగ్నిహోత్రి వెల్లడించారు. అయితే వాస్తానికి స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఈ మూవీని తీసుకురావాలని అనుకున్నారు. కానీ కొన్ని ఆర్థిక పరమైన కారణాల వల్లే ఈ సినిమా వాయిదా వేయాల్సి వస్తుందన్న చర్చ సాగుతోంది. ఎందుకంటే ఇటీవల అగ్నిహోత్రి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు నిర్మాతలు ఇలాంటి సినిమాలపై ఖర్చుపెట్టరని అన్నారు. ఈ మూవీకి మాకు ‘కశ్మీర్ ఫైల్స్ ’ ద్వారా వచ్చిన లాభం అంతా వెచ్చించామని అన్నారు. ఈ నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారన్న చర్చ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా సాగుతోంది.
‘ది కశ్మీర్ ఫైల్స్’ మూవీ తరువాత ‘వ్యాక్సిన్ వార్’ సినిమా తీస్తున్నట్లు అగ్నిహోత్రి 2022 నవంబర్ లోనే ప్రకటించారు. అయతే ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా నేరుగా థియేటర్లోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఈసారి సెప్టెంబర్ 28న ఎట్టి పరిస్థితుల్లో థియేటర్లోకి తీసుకొస్తామని అగ్నిహోత్రి ఈ వీడియోలో పేర్కొన్నారు. భారతీయ బయో సైంటిస్టుల గురించి కొన్ని అధ్యయనాలు చేయాల్సిన అవసరం ఉందని, ఈ సమయంలో కొందరు వైద్యులను సంప్రదించాల్సి వస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా అగ్నిహోత్రి మాట్లాడుతూ ‘కోవిడ్ లాక్ డౌన్ లో కశ్మీర్ ఫైల్స్ వాయిదా పడింది. ఈ సమయంలో సొంత టీకాను సాధ్య చేసే ఐసీఎంఆర్, ఎన్ ఐవీ వాళ్లతో కలిసి పరిశఓధనుల చేశాం. వారి పోరాటం, త్యాగం విశేషమైనది. దీనిని సినిమా రూపంలో తీసుకురావాలని అప్పుడే నిర్ణయించుకున్నాం. కొన్ని విదేశీ కంపెనీలు భారత శాస్త్రవేత్తలపై వ్యాక్సిన్ తయారు చేయకుండా ఎలాంటి ఒత్తిడి తీసుకువచ్చారో ఈ సినిమాలో చూపించాలని అనుకున్నాం’అని అన్నారు.
DATE ANNOUNCEMENT:
Dear friends, your film #TheVaccineWar #ATrueStory will release worldwide on the auspicious day of 28th September 2023.
Please bless us. pic.twitter.com/qThKxTjPiw— Vivek Ranjan Agnihotri (@vivekagnihotri) August 15, 2023