https://oktelugu.com/

Chiranjeevi: తన క్లోజ్ ఫ్రెండ్ చెప్పడం వల్లే, ఆ ప్లాప్ సినిమాను రిజెక్ట్ చేసిన చిరంజీవి…

ప్రస్తుతం ఇండస్ట్రీని శాసిస్తున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన కూడా తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అయినప్పటికీ తనకు నచ్చిన సినిమాని మాత్రం ప్రేక్షకుడికి రీచ్ చేయడంలో తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు.

Written By:
  • Gopi
  • , Updated On : February 13, 2024 / 02:14 PM IST
    Follow us on

    Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు స్టోరీలను జడ్జ్ చేయడంలో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అందువల్లే కొంతమంది సక్సెస్ ఫుల్ స్టోరీలను రిజెక్ట్ చేస్తారు. మరికొందరు మాత్రం సక్సెస్ ఫుల్ స్టోరీలను ఎంచుకొని మరి సక్సెస్ లు కొడుతూ ఉంటారు. ఇలా ప్రతి హీరో విషయంలో కొన్ని పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి.

    అందువల్లే కొంతమంది మంచి స్టోరీ లను ఎంచుకొని స్టార్ హీరోలుగా మారతారు. మరికొంత మంది మాత్రం ఫ్లాప్ సినిమాలను సెలెక్ట్ చేసుకొని కెరియర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొంతమంది మాత్రం ఏ అంచనాలు లేకుండా వచ్చిన కూడా మంచి స్క్రిప్ట్ లను చేసుకుంటూ ముందుకు వెళుతూ భారీ సక్సెస్ లను సాధించిన హీరోలు కూడా ఉన్నారు.

    ఇక ఇలాంటి క్రమంలోనే ప్రస్తుతం ఇండస్ట్రీని శాసిస్తున్న ఒకే ఒక్క హీరో మెగాస్టార్ చిరంజీవి. ఈయన కూడా తన కెరియర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలను రిజెక్ట్ చేశాడు. అయినప్పటికీ తనకు నచ్చిన సినిమాని మాత్రం ప్రేక్షకుడికి రీచ్ చేయడంలో తన వంతు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఒక సినిమా చేయాలా వద్దా అనే డైలమా లో ఉన్నప్పుడు, సినిమా ఇండస్ట్రీలో తనకు మంచి క్లోజ్ ఫ్రెండ్ అయిన సుధాకర్ వలన ఆ సినిమాని రిజెక్ట్ చేశాడు. అయితే ఆ సినిమా ఏంటి అంటే నాగార్జున హీరోగా పాన్ ఇండియా సినిమాగా వచ్చిన రక్షకుడు. ఈ సినిమాని మొదట చిరంజీవితో చేయాలని ఆ సినిమా దర్శక నిర్మాతలు భావించారు. అయితే ఈ సినిమా స్టోరీ చెప్పడానికి దర్శకుడు చిరంజీవిని కలిసినప్పుడు చిరంజీవి పక్కన ఆయన ఫ్రెండ్ అయిన నటుడు సుధాకర్ ఉన్నాడు. ఈ సినిమా స్టోరీ విన్న తర్వాత చిరంజీవి నేను ఆలోచించుకొని చెప్తాను అని చెప్పాడు ఇక అదే సమయంలో చిరంజీవి పక్కనే ఉన్న సుధాకర్ కూడా ఈ స్టోరీ విన్నాడు.

    అయితే ఈ సినిమా గురించి చిరంజీవి అలోచిస్తున్నప్పుడు, సుధాకర్ ఈ సినిమా నీకు సెట్ అవ్వదు చిరంజీవి అని చెప్పడంతో ఆయన కూడా బాగా ఆలోచించుకొని సుధాకర్ చెప్పినట్టుగానే దర్శక నిర్మాతలకు ఈ సినిమా నాకు సెట్ అవ్వదు అని చెప్పాడు. ఇక మొత్తానికైతే చిరంజీవి ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు. ఇక అదే కథతో నాగార్జున సినిమా చేసి భారీ ఫ్లాప్ ని తన ఖాతాలో వేసుకున్నాడు…