Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ‘ఆచార్య’ ప్లాప్ తర్వాత తన రెమ్యునరేషన్ విషయంలోనే కాదు, సినిమాల ప్లానింగ్ లో కూడా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం.. మెగాస్టార్ చిరంజీవి మూడు సినిమాలు చేస్తున్నారు. గాడ్ ఫాదర్, వాల్తేరు వీరయ్య, భోళా శంకర్. ఈ సినిమాలు పూర్తి అయ్యాక, ఓ కార్పొరేట్ కంపెనీతో కలిసి.. నిర్మాణ భాగస్వామ్యంలో వరుసపెట్టి రెండు సినిమాలు చేయాలని డీల్ కుదుర్చుకున్నారు. ఇప్పటికే ఒప్పందం కూడా కుదిరింది.
పైగా కథ ఏమిటి ? దర్శకుడు ఎవరనేది చిరు ఇష్టమే. మెగాస్టార్ ఎవరి పేరు చెబితే.. అతనే దర్శకుడు. నిర్మాణ భాగస్వామ్యంలో ఇది డీల్. కాకపోతే.. ఆ కార్పొరేట్ కంపెనీ ఓనర్ ఒక కండిషన్ పెట్టారు. ఏ సినిమా చేసినా.. ఆ సినిమా నాన్-థియేట్రికల్ రైట్స్ మొత్తం తమకే ఇవ్వాలని ఆ కార్పొరేట్ కంపెనీ షరతు. అందుకు.. చిరు కూడా అంగీకరించారు.
Also Read: Sammathame Collections: ‘సమ్మతమే’ ఫస్ట్ డే కలెక్షన్స్.. ఎంతొచ్చాయి ? ఇంకెంత రావాలి ?
అయితే, సదరు కంపెనీ ఒప్పందాన్ని చిరంజీవి తాజాగా రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. కాకపోతే, ఇప్పటికే.. ఆ కంపెనీ, మెగాస్టార్ కి 20 కోట్ల రూపాయల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. తాజాగా ఆ డబ్బును కూడా చిరు తిరిగి ఇచ్చేశారు. తన కొత్త సినిమాల విషయంలో ఆచితూచి వెళ్లాలని మెగాస్టార్ ఒకటికి పదిసార్లు ఆలోచిస్తున్నారు. అందుకే.. ఎలాంటి ఒప్పందాలు చేసుకోకూడదు అని చిరు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఐతే, అడ్వాన్స్ వెనక్కి ఇవ్వడానికి వేరే కారణం ఉంది అని టాక్ నడుస్తోంది. అగ్రిమెంట్ ప్రకారం 2023 చివరి నాటికి ఒక సినిమాను పూర్తి చేయాలి. ఈ టార్గెట్ రీచ్ అవ్వడం చిరుకి సాధ్యం కాదు. ఆల్రెడీ చిరు చేతిలో నాలుగు సినిమాలున్నాయి. అందుకే, ఆ కంపెనీతో చేసుకున్న ఒప్పందానికి చిరు దూరం జరిగారు. పైగా ఆచార్య విషయంలో చిరు బాగా ఫీల్ అయినట్లు తెలుస్తోంది.
అందుకే ఇక నుంచి సినిమా మొత్తం పూర్తయిన తర్వాత దాని స్థాయి, వచ్చిన లాభాలను బట్టి రెమ్యునరేషన్ తీసుకోవాలని చిరు ప్లాన్ చేస్తున్నారు. గాడ్ ఫాదర్, భోళా శంకర్ సినిమాల విషయంలో కూడా చిరు ఇలాగే ముందుకు వెళ్తున్నారు. మొత్తానికి చిరులో చాలా మార్పులు వచ్చాయి.
Also Read:8 Movies Releasing: ఒకేరోజు 8 సినిమాలు రిలీజ్.. కానీ అన్నీ వాష్ అవుటే !
Recommended Videos