
చందమామ అవునో కాదో తెలియదు గానీ, కాజల్ అగర్వాల్ కి మాత్రం టాలీవుడ్ లో ఆ పేరు బాగా కలిసొచ్చింది. ఇక ఇటీవలే పెళ్లి చేసుకొని ఓ ఇంటిదైన ఈ సీనియర్ బ్యూటీ.. తిరిగి మళ్ళీ ‘ఆచార్య’ షూటింగ్ లో జాయిన్ అయింది. ఈ రోజు ఉదయం ఆచార్య సెట్ లోకి భర్తతో పాటు వచ్చిన ఈ నవ దంపతులను చూసి.. ఎంతో మురిసిపోయిన మెగాస్టార్.. ఎదురువెళ్ళి మరీ వారికి స్వాగతం పలికి తనదైన శైలిలో వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఆ సమయంలో కాజల్ తెగ సిగ్గు పడిపోయింది . తనను ఇప్పుడు అందరూ కొత్తగా చూస్తున్నారని కూడా చిరుతో కాజల్ అందట.
Also Read: రోజా కొత్త బిజినెస్.. యూత్ కోసమే !
మరి కొత్త పెళ్లి కూతురుకు ఆ మాత్రం కొత్తదనం ఉంటుంది కదా. ప్రస్తుతం హైదరాబాద్ లోని కోకాపేటలో వేసిన భారీ సెట్లో చిరంజీవి, కాజల్ అగర్వాల్‌ల పై ఒక రొమాంటిక్ పాటను షూట్ చేస్తున్నారు. సాంగ్ షూట్ లో కాజల్ స్విమ్ షూట్ వేసుకుందట. ఆమె భర్త కాజల్ కష్టాన్ని చూసి షాక్ అయ్యాడట. వందల మందిలో ఫుల్ ఎక్స్ పోజింగ్ చేస్తోన్న కాజల్ ను చూసి.. అతను తెగ ఇదైపోతున్నాడట. ఇక పెళ్లి తర్వాత కొన్ని రోజులపాటు హనీమూన్ ట్రిప్ వేసి ఎంజాయ్ చేసి వచ్చిన ఈ బ్యూటీకి భర్త గౌతమ్ కిచ్లూతో హనీమూన్ పెద్దగా కిక ఇవ్వలేదట.
ఎప్పటినుండో పరిచయం ఉండటం.. పెళ్ళికి ముందే కాస్త సన్నిహితంగా మెలగడంతో హనీమూన్ అనేది నాకు కొత్త అనుభూతిని ఇవ్వలేదని కాజల్ చెప్పినట్లు ఇప్పటికే వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. పాపం కాజల్ కు కాస్త కొత్త అనుభవాలు కావాలట. ఇంతకీ కాజల్ ఆచార్య కోసం ఎన్ని రోజులు డేట్స్ ఇచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. మరోపక్క భారతీయుడు 2 షూట్ కూడా జరగాల్సి ఉంది. ఆ టీమ్ కూడా కాజల్ కోసమే ఎదురుచూస్తూ ఉంది.
Also Read: అవి రావనుకునే పెళ్లికి సిద్ధపడ్డాను – సమంత
ఇకఆచార్య విషయానికి వస్తే.. కొణిదెల ప్రొడక్షన్స్ మరియు మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్త సమర్పణలో ఎస్. నిరంజన్ రెడ్డి నిర్మాణంలో ఈ ‘ఆచార్య’ మూవీ తెరకెక్కుతుంది. క్లాసిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్యపాత్ర పోషిస్తున్నారు. మణిశర్మ బాణీలు కడుతున్న ఈ మూవీపై మెగా అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్