Sandeep Reddy Vanga : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నారు. మరి పాన్ ఇండియా లెవెల్లోకి మన సినిమా స్థాయి పెరగడం వల్ల ఇప్పుడు ఏ దర్శకుడు కథ రాసుకున్న కూడా అది పాన్ ఇండియా సక్సెస్ ని సాధించే విధంగా ఉండేలా చూసుకుంటున్నారు…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఎనలేని గుర్తింపైతే ఉంది. ఇక దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా వెలుగొందుతున్న ఈయన ఇప్పటికి మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా మెగాస్టార్ చిరంజీవి లాంటి హీరో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉండడం నిజంగా మన అదృష్టమనే చెప్పాలి. ఇక ఇప్పటివరకు ఆయన సాధించని విజయం లేదు, ఆయన అందుకొని అవార్డు లేదు. మరి ఇలాంటి స్టార్ హీరో ఈ ఏజ్ లో కూడా భారీ సినిమాలను చేయడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఇక ఇప్పటికే ఆయన విశ్వంభర సినిమా చేస్తున్నప్పటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరొక సినిమాకి కమిట్ అయ్యాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం లో కూడా ఒక భారీ గ్యాంగ్ స్టర్ సినిమాని చేయడానికి సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాలతో పాటు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో కూడా మరొక సినిమాని చేయడానికి ఆయన కసరత్తులు చేసుకుంటున్నాడు. అయితే రీసెంట్ గా సందీప్ రెడ్డివంగా చిరంజీవికి ఒక కథను చెప్పారట. అది మరీ వైల్డ్ గా ఉండడంతో చిరంజీవి ఒక్కసారిగా షాక్ అయిపోయారట. మరి ఈ రేంజ్ లో కథ వద్దు కానీ కొంచెం డోస్ తగ్గించి రాయమని చెప్పారట. ఒక్కసారిగా ఆ కథ విన్న వెంటనే చిరంజీవికి భయం పట్టుకుందని కూడా కొంతమంది సన్నిహిత వర్గాల నుంచి సమాచారం అయితే అందుతుంది.
ఇంతకీ సందీప్ రెడ్డివంగా ఎలాంటి కథ చెప్పాడో మరో అనిమల్ కథని చెప్పుంటాడు అంటూ కొందరు కామెంట్ చేస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా సందీప్ రెడ్డి వంగా స్టైల్ చిరంజీవికి సెట్ అవుతుందా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఒకవేళ వీళ్ళ కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే మాత్రం సందీప్ వంగ తన రూట్ మొత్తాన్ని పక్కన పెట్టి చిరంజీవి ట్రాక్ లోకి రావాల్సి ఉంటుంది.
చిరంజీవి ఎక్కువగా ఎంటర్టైన్మెంట్ అందించే సినిమాలను చేస్తాడు. కాబట్టి మాస్ కమర్షియల్ వే లోనే సందీప్ వంగా సినిమాలు చేయాల్సి ఉంటుంది. అలాగే తన టైపు అఫ్ ట్రీట్మెంట్ జోడించి కమర్షియల్ సినిమాని చేస్తే ఎలా ఉంటుందో సందీప్ అలాంటి ధోరణిలో సినిమా చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది.
ఇక మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేసే అవకాశం రావడం అనేది అంత ఆషామాషి వ్యవహారం అయితే కాదు. కాబట్టి అవకాశం వచ్చినప్పుడు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నవాళ్లే స్టార్ డైరెక్టర్లుగా ముందుకు సాగుతారు. మరి సందీప్ వంగ ఈ విషయంలో చిరంజీవితో ఎలాంటి సినిమా చేస్తాడు ఎలా ప్రేక్షకులు మెప్పిస్తాడనేది తెలియాల్సి ఉంది…