Chiranjeevi Upcoming Movies: మెగాస్టార్ చిరంజీవి హీరోగా వచ్చిన సినిమాలన్నీ సూపర్ సక్స్ లను సాధించిన విషయం మనకు తెలిసిందే…ఇక ఇప్పటి వరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టినవే కావడం వల్ల ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఖైదీ నెంబర్ 150 సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ ని స్టార్ట్ చేసిన చిరంజీవి అప్పటినుంచి పెద్దగా సక్సెసులైతే సాధించలేకపోతున్నాడు. కారణం ఏదైనా కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా తప్పులైతే జరుగుతున్నాయని తన అభిమానులు సైతం ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పుడు చిరంజీవి వశిష్ట డైరెక్షన్లో విశ్వంభర సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తయినప్పటికి సీజీ వర్క్ అయితే జరుగుతోంది. ఈ సినిమా తర్వాత ఆయన అనిల్ రావిపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా కోసం భారీ కసరత్తులను చేస్తున్నాడు. మరి ఈ సినిమా సంక్రాంతి కానుకగా 2026వ సంవత్సరంలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఈ రెండింటి తర్వాత ఆయన బాబీ డైరెక్షన్లో ఒక సినిమాకి కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇక రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక చిన్న పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు…
Also Read: ‘స్టాలిన్’ రీ రిలీజ్ కి డిజాస్టర్ రెస్పాన్స్..ప్రింట్ ఖర్చులు కూడా రాలేదుగా!
దాంతో పాటుగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందంటు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల చెప్పకనే చెబుతున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తాడు తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది…
ఇప్పటివరకు ఎవరు ఎలాంటి సినిమాలు చేసినా కూడా మెగాస్టార్ చిరంజీవికి పోటీకి రాలేకపోయారు. మరి ఈ మధ్యకాలంలో చిరంజీవి కొంతవరకు తడబడుతున్నాడు. కాబట్టి తన లైనప్ తో మరోసారి అందరికి షాక్ ఇస్తూ యంగ్ డైరెక్టర్లందరితో సినిమాలు చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఇప్పుడు చేస్తున్న సినిమాలతో ఆయన ఎలాంటి విజయాలు సాధిస్తాడు.
Also Read: నా సినిమాలో అసలైన చిరంజీవిని చూపిస్తా అంటూ బ్లడ్ ప్రామిస్ చేసిన దర్శకుడు…
దాన్నిబట్టి ఆయన స్టార్ డమ్ అనేది ఆధారపడి ఉంటుందని మరికొంతమంది కామెంట్లు చేస్తూ ఉండటం విశేషం…ఇక చిరంజీవి ఇప్పటివరకు లైట్ వెయిట్ సినిమాలు మాత్రమే చేస్తున్నాడు…కానీ ఆయన ఎఫెక్టివ్ గా ఫోకస్ చేసి సినిమాలు చేయాల్సిన అవసరమైతే ఉంది. దానికోసం మంచి కథలను ఎంచుకుంటే మంచిదని మరికొంతమంది చెబుతుండటం విశేషం…