Srikanth Odela Post On Chiranjeevi: దసర సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న దర్శకుడు శ్రీకాంత్ ఓదెల… ప్రస్తుతం ఆయన నానితో ‘ప్యారడైజ్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక దానికోసమే ఈ సినిమాని చాలా ప్రస్తేజియస్ గా తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమా గ్లింప్స్ తో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక అటెన్షన్ ను క్రియేట్ చేసిన ఆయన ఇప్పుడు ఈ సినిమాతో పాన్ ఇండియా మొత్తాన్ని తన వైపు తిప్పుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నట్టుగా తెలుస్తోంది…ఇక ప్యారడైజ్ సినిమా తర్వాత ఆయన చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్టును చేయబోతున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన చేయబోతున్న సినిమాలు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీని తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. మరి ఇలాంటి సందర్భంలోనే చిరంజీవికి వీరాభిమానినని ఆయన కోసమే సినిమాలు థియేటర్ కెళ్ళి ఎగబడి చూసే వాడినని, ఒక సినిమా టికెట్ కొనే వాడితో సైతం సినిమాని తీయించగలిగే రేంజ్ కి తీసుకెళ్లే కెపాసిటి ఒక చిరంజీవికి మాత్రమే ఉందని దానికి తనే ఉదాహరణ అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరి ఏది ఏమైనా కూడా గత కొన్ని రోజుల నుంచి చిరంజీవిని తను మిస్ అవుతున్నాడని అసలైన చిరంజీవిని నేను చూపిస్తానని ‘బ్లడ్ ప్రామిస్’ చేసి మరి చెబుతున్నాను అంటూ ఆయన చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…ఇక చిరంజీవితో ఆయన ఒక సినిమాకి కమిట్ అయిన విషయం మనకు తెలిసిందే.
మరి వీళ్ళిద్దరి కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ఎంతటి పెను ప్రభంజనాన్ని సృష్టించబోతుంది అనేది శ్రీకాంత్ ఓదెల చాలా క్లియర్ కట్ గా తెలియజేశాడు. మరి ఈ సినిమా కనుక సెట్స్ మీదకి వస్తే మాత్రం అన్ని రికార్డులు బ్రేక్ అయిపోతాయని శ్రీకాంత్ ఓదెల చెప్పకనే చెబుతున్నాడు. స్క్రీన్ మీద ఒకప్పటి చిరంజీవిని చూపిస్తానని ఆయన చెప్పిన మాటను చూస్తుంటే, చిరంజీవి కోసం ఒక భారీ పకడ్బందీ స్క్రిప్ట్ ను రెడీ చేసినట్టుగా తెలుస్తోంది…
ఇక ఒకప్పటి చిరంజీవిని స్క్రీన్ మీద చూపించడం తన బాధ్యత అని తనకోసం తన ఈ సినిమాను చేసుకుంటున్నానని కూడా అందులో మెన్షన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి దసర సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులను మెప్పించిన ఆయన ఇప్పుడు చేస్తున్న ప్యారడైజ్ సినిమాని బ్లాక్ బస్టర్ సక్సెస్ గా నిలపడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతుండటం విశేషం…