Chiranjeevi Film Workers: తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత 15 రోజులుగా సినీ కార్మికులు సమ్మె చేస్తూ షూటింగ్స్ మొత్తాన్ని నిలిపివేసిన విషయం మనకు తెలిసిందే. పెరుగుతున్న ఖర్చులకు అనుగుణంగా తమ వేతనాన్ని పెంచాలనే డిమాండ్ తో వాళ్లు సమ్మె అయితే స్టార్ట్ చేశారు. ఇక అప్పటి నుంచి ఇప్పటివరకు షూటింగ్ లను బంద్ చేసి సమ్మెను సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్న సినీ కార్మికులందరు వాళ్ల విషయంలో ప్రొడ్యూసర్స్ అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపడుతున్నారు. ఇక రీసెంట్ గా మెగాస్టార్ చిరంజీవి సైతం వాళ్ళు చేస్తున్న సమ్మె మీద స్పందించి ప్రతి క్రాఫ్ట్ లో ఉన్న కొంతమంది సీనియర్లతో మీటింగ్ ని ఏర్పాటు చేశాడు. ఇక అందులో వాళ్లు తమ ప్రాబ్లమ్స్ ని చిరంజీవికి చాలా క్లియర్ గా తెలియజేశారు…ఇక ఫిలిం ఫెడరేషన్ లో ఉన్న చాలా మంది సభ్యుల యొక్క వాదనలు విన్న తర్వాత చిరంజీవి మంగళవారం నాలుగు గంటలకు ప్రొడ్యూసర్స్ అందరితో కలిపి ఒక మీటింగ్ ని అరేంజ్ చేస్తున్నాను అందులో మీ సమస్యల గురించి మాట్లాడి ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానని చిరంజీవి చెప్పడంతో కార్మికులు కొంతవరకు ఆనంద పడుతున్నారు.
Also Read: జగపతి బాబు దెబ్బకు షో నుండి పారిపోయిన హీరోయిన్ శ్రీలీల..వీడియో వైరల్
నిజానికి సినీ కార్మికులు సైతం మాట్లాడుతూ ప్రొడ్యూసర్లు బాగుంటేనే మేము బాగుంటాం కానీ మా పరిస్థితిని ప్రొడ్యూసర్లు కూడా అర్థం చేసుకుంటే బాగుంటుంది అంటూ వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేశారు…అయితే ప్రొడ్యూసర్స్ అందరు వాళ్ల వాళ్ల మీటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల అందరూ కలిసి మీటింగ్ పెట్టలేకపోతున్నారు…
ఇక ఎలాగైనా సరే మంగళవారం ఫిలిం ఛాంబర్ మెంబర్స్ తో మీటింగ్ ను ఆరెంజ్ చేసి ఈ సమ్మెకు పులిస్టాప్ పెట్టాలని చిరంజీవి డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది…ఎందుకంటే ఇప్పటికే రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన సినిమాలు షూటింగ్స్ జరగపోతే ఆ సినిమాలు అనుకున్న డేట్ కి రావని దానివల్ల అందరూ భారీగా నష్టపోవాల్సి వస్తుందనే ఉద్దేశ్యంతోనే చిరంజీవి ముందుకు వచ్చి ఈ ప్రాబ్లెమ్ మీద స్పందించినట్టుగా తెలుస్తోంది…
ఇక ఇది చూసిన చాలామంది తెలుగు సినిమా ప్రేక్షకులు సైతం మెగాస్టార్ చిరంజీవి గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఆయన ప్రతి ఒక్కరు ప్రాబ్లంని అర్థం చేసుకొని దాన్ని సాల్వ్ చేయడానికి శతవిధాల ప్రయత్నం చేస్తాడు అని చెప్పడానికి దీనిని మనం ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు అంటూ చిరంజీవి గొప్పతనం గురించి మాట్లాడుతున్నారు…