Homeఎంటర్టైన్మెంట్Chiranjeevi : చిరంజీవి ఆయన్ని తక్కువ అంచనా వేశాడు, కట్ చేస్తే లెజెండ్ అయ్యాడు!

Chiranjeevi : చిరంజీవి ఆయన్ని తక్కువ అంచనా వేశాడు, కట్ చేస్తే లెజెండ్ అయ్యాడు!

Chiranjeevi : చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన టి తెలుగు చలన చిత్ర సీమలో ఒక చరిత్ర లిఖించాడు. దశాబ్దాల పాటు నెంబర్ వన్ హీరోగా సిల్వర్ స్క్రీన్ ని ఏలాడు. అయితే చిరంజీవి ఓ నటుడిని తక్కువ అంచనా వేశాడు. అది ప్రాధమిక దశలో. చిరంజీవి ఎందరికో సపోర్ట్ ఇచ్చారు. వారిలో ఒక లెజెండ్ కూడా ఉన్నారు. ఆయనే బ్రహ్మానందం. ఈ పేరు తెలియని సినిమా ప్రేక్షకుడు ఉండడు. కానీ బ్రహ్మానందం పరిశ్రమకు రావడానికి కారణం చిరంజీవి. ఆయనకు అవకాశం ఇచ్చింది ఆయనే.

వృత్తిరీత్యా తెలుగు లెక్చరర్ అయిన బ్రహ్మానందం కి నటన మీద మక్కువ ఉంది. ఆయన నాటకాలు ఆడేవారు. సినిమా నటుడిగా మారాలని అప్పుడప్పుడు ఆయన సినిమా షూటింగ్స్ చూసేందుకు వచ్చేవాడట. చిరంజీవి చంటబ్బాయ్ మూవీ షూటింగ్ చేస్తున్న సమయంలో బ్రహ్మానందం సెట్ కి వెళ్ళాడట. చిరంజీవి డాన్స్ చేస్తుంటే బ్రహ్మానందం విచిత్రంగా చూస్తున్నాడట. దాంతో చిరంజీవి డిస్ట్రబ్ అయ్యాడట. చిరంజీవి కోప్పడ్డాడట. ఆ వ్యక్తి ఎవరని దర్శకుడు జంధ్యాలను అడిగాడట. ఆయన ఒక లెక్చరర్ అని జంధ్యాల చిరంజీవితో చెప్పాడట. దాంతో రియలైజ్ అయిన చిరంజీవి ఒక రోజు బ్రహ్మానందం ని పిలిపించి మాట్లాడారు అట.

Also Read : నేడు ఈడీ విచారణకు హాజరు కానున్న సూపర్ స్టార్ మహేష్ బాబు..!

ఆ విధంగా జంధ్యాల చిత్రాల్లో బ్రహ్మానందం కి అవకాశం వచ్చింది. ఇక జంధ్యాల తెరకెక్కించిన అహనా పెళ్ళంట బ్రహ్మానందం కి బ్రేక్ ఇచ్చింది. ఆయన్ని స్టార్ కమెడియన్ ని చేసింది.తాను సినిమాల్లోకి రావడానికి చిరంజీవి ఎంత సపోర్ట్ చేశాడో ఓ సందర్భంలో బ్రహ్మానందం చెప్పుకొచ్చాడు. తాను చేసిన సాయాన్ని బ్రహ్మానందం చెబుతుంటే చిరంజీవి అడ్డుకున్నారు.

1500 లకు పైగా చిత్రాల్లో నటించిన బ్రహ్మానందం లెజెండ్ అయ్యారు. ఆయనకు మించిన కమెడియన్ ఈ దేశంలోనే లేను అనడంలో సందేహం లేదు. బ్రహ్మానందం ఈ మధ్య కామెడీ మూవీస్ తగ్గించారు. కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తున్నాడు. ఇటీవల బ్రహ్మా ఆనందం టైటిల్ తో ఓ మూవీ చేశారు. ఆయన లవర్ బాయ్ గా కనిపించడం విశేషం. బ్రహ్మానందం కుమారుడు గౌతమ్ ఈ చిత్రంలో మరో ప్రధాన పాత్ర చేశాడు. వెన్నెల కిషోర్ మరో కీలక రోల్ చేశాడు. ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆడలేదు.

Also Read : బాలయ్య చేయాల్సిన సినిమాను చిరంజీవి ఎందుకు చేశాడు..?

RELATED ARTICLES

Most Popular