https://oktelugu.com/

బాలయ్య విరాళంపై స్పందించిన మెగాస్టార్

దేశంలో విధంగా లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. లాక్డౌన్ తో సినిమా షూటింగ్ వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డారు. దీంతో దినసరి వేతనంపై పని చేసే సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సీని కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ ఏర్పాటైంది. దీనిలో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో సీని కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి ఇప్పటికే పలువురు సినిమా […]

Written By: , Updated On : April 3, 2020 / 06:16 PM IST
Follow us on

దేశంలో విధంగా లాక్డౌన్ నేపథ్యంలో వ్యాపార, వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. లాక్డౌన్ తో సినిమా షూటింగ్ వాయిదా పడగా థియేటర్లు మూతపడ్డారు. దీంతో దినసరి వేతనంపై పని చేసే సినీ కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సీని కార్మికులను ఆదుకునేందుకు మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ మనకోసం’ ఏర్పాటైంది. దీనిలో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. వీరి ఆధ్వర్యంలో సీని కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించనున్నారు.

‘కరోనా క్రైసిస్ ఛారిటీ’కి ఇప్పటికే పలువురు సినిమా స్టార్లు విరాళాలను ప్రకటించారు. తాజాగా నందమూరి నటసింహం బాలకృష్ణ ‘సీసీసీ మనకోసం’ కు రూ.25లక్షల విరాళాన్ని ప్రకటించారు. ఇందుకు సంబంధించిన చెక్కును ‘సీసీసీ మనకోసం’ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ కల్యాణ్ కు చెక్కును అందజేశారు. అలాగే తెలుగు రాష్ట్రాలకు రూ.50లక్షల రూపాయాల చొప్పున కోటి రూపాయాల విరాళాన్ని ప్రకటించారు. బాలయ్య భారీ విరాళంపై మెగాస్టార్ ట్వీటర్లో స్పందించారు.

‘ప్రియమైన సోదరుడు బాలకృష్ణ‌కు ధ‌న్య‌వాదాలు.. ప్ర‌తీ క‌ష్ట‌స‌మ‌యంలోనూ ప్ర‌జ‌ల‌ను ఆదుకోవ‌డం కోసం సినీ ప‌రిశ్ర‌మ ఒక్క‌టిగా ముందుకొస్తే మీరెప్పుడూ తోడుంటారు. సినీ కార్మికుల‌కు రూ.25ల‌క్ష‌లు, తెలంగాణ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు, ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్రానికి రూ.50 ల‌క్ష‌లు విరాళం అందించినందుకు కృత‌జ్ఞ‌త‌లు’ అంటూ మెగాస్టార్ తన ట్వీటర్లో ట్వీట్ చేశారు. మెగాస్టార్ ట్వీటర్లోకి వచ్చాక బాలయ్యపై ట్వీటర్లో స్పందించడం ఇదే తొలిసారి. సినిమాల పరంగా ఢీ అంటే ఢీ అనే మెగాస్టార్, బాలయ్యలు సీని కార్మికుల ఆదుకునేందుకు కలిసి పని చేయడంపై అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.