మెగాస్టార్ తో సినిమా ఫిక్స్.. కానీ.. !

తెలుగు డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కి ఉన్న డిమాండ్ ఎవరికీ లేదేమో. రాజమౌళిని కూడా మాతో సినిమా చేసి పెట్టమని నోరు తెరిచి ఏ స్టార్ హీరో తొందరగా అడగలేరు. కానీ, త్రివిక్రమ్ ను మాత్రం ప్రతి హీరో తనతో సినిమా చేసేదాకా వదిలిపెట్టరు. సహజంగా త్రివిక్రమ్ కి అందరి స్టార్ హీరోలతో అంత చనువు ఉంది. పర్సనల్ గా త్రివిక్రమ్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అందుకే అందరి చూపు త్రివిక్రమ్ వైపే. అందుకేనేమో […]

Written By: admin, Updated On : August 14, 2020 6:50 pm
Follow us on


తెలుగు డైరెక్టర్స్ లో త్రివిక్రమ్ కి ఉన్న డిమాండ్ ఎవరికీ లేదేమో. రాజమౌళిని కూడా మాతో సినిమా చేసి పెట్టమని నోరు తెరిచి ఏ స్టార్ హీరో తొందరగా అడగలేరు. కానీ, త్రివిక్రమ్ ను మాత్రం ప్రతి హీరో తనతో సినిమా చేసేదాకా వదిలిపెట్టరు. సహజంగా త్రివిక్రమ్ కి అందరి స్టార్ హీరోలతో అంత చనువు ఉంది. పర్సనల్ గా త్రివిక్రమ్ తో ఎప్పుడూ టచ్ లో ఉంటారు. అందుకే అందరి చూపు త్రివిక్రమ్ వైపే. అందుకేనేమో మెగా ఫ్యాన్స్ ఊహల్లోని డ్రీమ్ కాంబినేషన్లలో త్రివిక్రమ్ – మెగాస్టార్ కాంబినేషన్ అనేది ప్రధానమైనది. ఈ కలయికలో సినిమా అంటే నిజంగా ఎంతో క్రేజ్ తో కూడుకున్నది కూడా. ఎప్పటికైనా త్రివిక్రమ్, మెగాస్టార్ సినిమా చేస్తాడని మెగా ఫ్యాన్స్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్నారు.

Also Read: స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

కానీ, త్రివిక్రమ్ ఇప్పటివరకూ మెగా ఫ్యాన్స్ కోరికను తీర్చే ప్రయత్నం చేయలేదు. అయితే ఈ సారి వారి కోరికను ఈ స్టార్ డైరెక్టర్ తీర్చేలా ఉన్నాడు. అవును, ఇప్పటికే మెగాస్టార్ కి త్రివిక్రమ్ ఒక ఇంట్రస్టింగ్ లైన్ చెప్పాడట. నిజానికి ఎన్టీఆర్ తో సినిమా తరువాత, త్రివిక్రమ్ మహేష్ బాబుతో సినిమాని ప్లాన్ చేసుకున్నాడు. అయితే సడెన్ గా మెగాస్టార్ సినిమాల వేగం పెంచడంతో.. త్రివిక్రమ్ ఇటీవలే ఆయనను కలిసి స్టోరీ లైన్ చెప్పాడు. ప్రస్తుతం ఆ లైన్ మీద త్రివిక్రమ్ వర్క్ చేస్తున్నాడట.

Also Read: బయటపడ్డ స్టార్ హీరోయిన్ బాగోతం !

పక్కా కమర్షియల్ గా ఈ సినిమా సాగనుందని.. అలాగే సినిమాలో దొంగ స్వామిజీల మీద ఒక మెసేజ్ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఏమైనా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సినిమా వస్తోందంటే.. వంద శాతం కమర్షియల్ ఎంటెర్టైనర్ అనేది దాదాపు ఫిక్స్ అయిపోయారు. ఎలాగూ హాస్యాన్ని పండించడంలో మెగాస్టార్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే వీరి కలయికలో సినిమా రావడానికి మరో రెండేళ్లు సమయం పడుతుంది.