https://oktelugu.com/

Bhola Shankar: అక్షరాలా 9 మిలియన్ వ్యూస్.. సెన్సషనల్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ‘భోళా మేనియా’

సినిమా విడుదలైన తర్వాత ఈ పాటకి మరింత మాస్ రెస్పాన్స్ వస్తుందని, మెగాస్టార్ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమర్చిపొయ్యేలా చేస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా ఈ నెలలోనే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మూవీ టీం, ఈ టీజర్ తో మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది.

Written By:
  • Vicky
  • , Updated On : June 5, 2023 / 06:43 PM IST

    Bhola Shankar

    Follow us on

    Bhola Shankar: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన ‘భోళా శంకర్’ చిత్రం ఆగష్టు 11 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల అవ్వబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఇప్పటి నుండే విడుదల చెయ్యడం ప్రారంభించారు. ఈ సినిమాకి మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తుండగా, మణిశర్మ కొడుకు మహతి సాగర్ సంగీతం అందించాడు.

    ఈ చిత్రానికి ఆయన అదిరిపొయ్యే చార్ట్ బస్టర్ సాంగ్స్ ఒక మూడు ఇచ్చాడని గత కొంతకాలం గా సోషల్ మీడియా లో జోరుగా ప్రచారం సాగుతున్న వార్త. నిన్న ఆదివారం పురస్కరించుకొని ఈ చిత్రానికి సంబంధించిన మొదటి పాట ‘భోళా మేనియా’ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేసారు. ఈ వీడియో సాంగ్ కి ఫ్యాన్స్ నుండి అద్భుతమైన యావరేజి రెస్పాన్స్ వచ్చింది. రొటీన్ ట్యూన్ ని విన్నట్టుగానే ఉంది, స్పెషల్ ఏముంది అంటూ కామెంట్ చేసారు.

    అయితే ఇలాంటి సాంగ్స్ మాస్ కి చాలా తేలికగా రీచ్ అవుతుంది అనే సత్యాన్ని మాత్రం గమనించలేకపొయ్యారు ఫ్యాన్స్. పైగా చిరంజీవి డ్యాన్స్ స్టెప్పులను ఈ పాటలో ఉంచారు, మెగాస్టార్ డ్యాన్స్ వేస్తే ఎవరు మాత్రం చూడకుండా ఉంటారు?, అందుకే ఈ పాటకి కూడా 24 గంటల్లో దాదాపుగా 9 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి. ఇది టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 5 హైయెస్ట్ వ్యూస్ సాధించిన లిరికల్ వీడియో సాంగ్స్ లో ఒకటి అని అంటున్నారు ట్రేడ్ పండితులు.

    సినిమా విడుదలైన తర్వాత ఈ పాటకి మరింత మాస్ రెస్పాన్స్ వస్తుందని, మెగాస్టార్ తన డ్యాన్స్ తో ప్రేక్షకులను మైమర్చిపొయ్యేలా చేస్తాడని అంటున్నారు. ఇక ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని కూడా ఈ నెలలోనే విడుదల చేసే ప్లాన్ లో ఉన్నారట మూవీ టీం, ఈ టీజర్ తో మూవీ పై ఉన్న అంచనాలు అమాంతం పెరిగే ఛాన్స్ కూడా ఉంది.