Chiranjeevi Speech Kuberaa Success Meet: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో ఒక సినిమా పెద్ద హిట్ అయ్యిందంటే మనస్ఫూర్తిగా అందరికంటే ముందు శుభాకాంక్షలు తెలియజేసేది మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) మాత్రమే. తనతో సమానమైన హీరోల సినిమాలు హిట్ అయినా, లేకపోతే చిన్న సినిమాలు హిట్ అయినా ప్రోత్సహించడం లో ఎప్పుడూ ముందుంటాడు మెగాస్టార్. అందుకే ఇండస్ట్రీ లో ప్రతీ ఒక్కరు ఆయన్ని ఎంతో గౌరవిస్తూ, ప్రేమిస్తూ ఉంటారు. రీసెంట్ గా విడుదలైన శేఖర్ కమ్ముల(Sekhar Kammula) ‘కుబేర'(Kubera Movie) చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ గా నిల్చిందో తెలిసిందే. మొదటి వారం ఈ చిత్రానికి వసూళ్ల సునామీ వచ్చింది. ఈ సందర్భంగా మూవీ టీం హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేసింది. ఈ సక్సెస్ మీట్ కి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
Also Read: రష్మిక నేషనల్ క్రష్ మాత్రమే కాదు..నాకు కూడా క్రష్ నే – అక్కినేని నాగార్జున
ముఖ్యంగా హీరో ధనుష్(Dhanush) గురించి మాట్లాడుతూ ‘ఈ క్యారక్టర్ ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ హిస్టరీ లో ధనుష్ తప్ప ఎవ్వరూ చెయ్యలేరు. ఒకవేళ ధనుష్ ఈ క్యారక్టర్ చెయ్యను అనుంటే శేఖర్ కమ్ముల కి మరో నటుడిని వెతుక్కోవడం చాలా కష్టం అయ్యేది. నా దగ్గరకి వచ్చినా నేను చెయ్యలేను బాబోయ్ అనేవాడిని. అంత సాహసం ఎవ్వరూ చెయ్యలేరు. ఈ సినిమా ప్రారంభం లో తిరుపతి లో బెగ్గర్స్ అందరితో పాటు ధనుష్ కూడా కూర్చున్నాడు అనే విషయాన్ని నేను గమనించలేకపోయాను. అతని హావభావాలు,పరిగెత్తే తీరు, ఇలా ఆయన పాత్రలో ఒదిగిపోయాడు. నాకు దేవా అనే క్యారక్టర్ మాత్రమే కనిపించింది కానీ, ధనుష్ కనిపించలేదు. ఇది ఆయనకీ మరో అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ అవుతుంది. మాకు ఎప్పుడైనా అవార్డు వస్తే చాలా గర్వంగా ఫీల్ అయ్యి చెప్పుకుంటూ ఉంటాము. కానీ ధనుష్ కి అది సాధారణం అయిపోయింది’ అంటూ చెప్పుకొచ్చాడు మెగాస్టార్ చిరంజీవి.
ఈ ఈవెంట్ లో ధనుష్ చిరంజీవి కాళ్ళు మొక్కడం ఇప్పుడు నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ టాపిక్ అయ్యింది. సోషల్ మీడియా లో మెగా అభిమానులు ధనుష్ సింప్లిసిటీ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చిరంజీవి పట్ల ఆయన చూపించిన గౌరవానికి ముగ్దులు అయిపోయారు మెగా ఫ్యాన్స్. ఇక నిన్న జరిగిన ఈవెంట్ లో శేఖర్ కమ్ముల గురించి కూడా చాలా గొప్పగా మాట్లాడాడు మెగాస్టార్. ఆయన మాట్లాడుతూ ‘నా అభిమాని గా ఇండస్ట్రీ లోకి వచ్చి,నన్ను ఆదర్శంగా తీసుకొని, తన సొంత కష్టం మీద ఈ స్థాయికి ఎదిగిన శేఖర్ కమ్ముల ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది. శేఖర్ కమ్ముల చిత్రం లో పాత్రలు, ఆ పాత్రల పేర్లు జీవితాంతం గుర్తుండిపోతాయి. నా సినిమాలోని పాత్రలే నాకు గుర్తుండవు, కానీ శేఖర్ కమ్ముల చిత్రం లోని పాత్రలు మాత్రం ఇప్పటికీ నాకు గుర్తు ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చాడు.
