Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను బ్రేక్ చేశాయి. ఇక అలాంటి చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో సైతం పలు జాగ్రత్తలైతే తీసుకుంటున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్ నిల్చోబెట్టాయి. ఇక మొదట ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోబోతున్నాడు అనేది కూడా తెలియాల్సి ఉంది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి ఆయనకు సరైన సక్సెసులైతే రావడం లేదు. రీసెంట్ గా మన శంకర్ వరప్రసాద్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. 400 కోట్ల క్లబ్లో కూడా చేరిపోయాడు కానీ అది చిరంజీవి రేంజ్ ఇక దీనికి తోడుగా ఆయన రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి తను సోలో హీరోగా చేయకుండా ఎవరో ఒక హీరోను తనతో పాటు తోడుగా తెచ్చుకుంటున్నాడు అంటూ కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.
గాడ్ ఫాదర్ సినిమాలో చిరంజీవితో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటించాడు. ఇక ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి తో పాటు రవితేజ నటించిన ఆ సినిమా సక్సెస్ లో తను కీలకపాత్ర వహించాడు అంటూ కామెంట్లు చేశారు… ఇక ‘మన శంకర్ వరప్రసాద్’ సినిమాలో ఏకంగా వెంకటేష్ తో కలిసి నటించాడు.
ఇక చిరంజీవి సోలోగా వస్తే భారీ కలెక్షన్స్ రావని భయపడుతున్నాడా?లేదంటే సక్సెస్ లు దక్కవని ఆందోళన చెందుతున్నాడా? ఎందుకని తనతో పాటు మరొక హీరోను కూడా తోడు తెచ్చుకుంటున్నాడు అంటూ కొన్ని రోజులుగా చర్చలైతే నడుస్తున్నాయి. ఇక ప్రస్తుతం బాబీ డైరెక్షన్లో చేస్తున్న సినిమాలో మోహన్ లాల్, శివ రాజ్ కుమార్ లను కూడా భాగం చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఏది ఏమైనా కూడా ఇప్పుడు చిరంజీవి సోలోగా నిరూపించుకోవాల్సిన సమయమైతే ఆసన్నమైంది. ఇక ఇలాంటి సందర్భంలో ఎందుకని తన సినిమాలో ఇంకొక హీరో ని కూడా ఆడ్ చేసుకుంటున్నాడు అనే విషయం మీద సరైన క్లారిటి అయితే రావడం లేదు. మొత్తానికైతే కథ డిమాండ్ చేయడం వల్లే ఆయన వాళ్లను ఆడ్ చేస్తున్నాడని దానివల్ల సక్సెస్ లు కూడా దక్కుతున్నాయి. కాబట్టి తప్పేముంది అంటూ మరికొంతమంది కామెంట్లు చేస్తున్నారు…
