Superstar Krishna- Chiranjeevi: సినిమా ఇండస్ట్రీలో కలిసొస్తే సంపాదన కోట్లలో ఉంటుంది. స్టార్లుగా మారితే రాజభోగం అనుభవించొచ్చు. కానీ ఒక్కోసారి సిరి సంపదలు వచ్చినట్లే వచ్చి.. మాయమైపోతూ ఉంటాయి. టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన కొందరు స్టార్ హీరోలు ఆస్తులు బాగానే సంపాదించినా వాటిలో కొన్నింటిని పలు కారణాలతో అమ్మేశారు. ఇలాంటి వారిలో మెగాస్టార్ చిరంజీవి ఒకరు. మూడు దశాబ్దాల హీరో చిరంజీవికి తెలుగు పరిశ్రమ చెన్నైలో ఉండగానే ఆస్తులు కూడబెట్టారు. అందులో ఒకదానిని సూపర్ స్టార్ కృష్ణ కు అమ్మేశాడట. ఇటీవల ప్రముఖ నిర్మాత ఎన్ వీ ప్రసాద్ ‘గాడ్ పాదర్’ ప్రమోషన్ సందర్భంగా ఆ విషయాన్ని చెప్పారు. ఆ వివరాలు చూద్దాం.

చిత్ర పరిశ్రమలన్నీ చెన్నైలోనే ఉండడంతో స్టూడియోలు కూడా అక్కడే ఉండేవి. ఆ కాలంలోనే సినిమా స్టార్లుగా మారిన కృష్ణ, చిరంజీవిలు కొన్ని ఆస్తులను కూడబెట్టారు. ఆ తరువాత చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కు వచ్చినా.. వీరి ఆస్తులు అక్కడే ఉండిపోయాయి. సూపర్ స్టార్ కృష్ణకు చెన్నైలోని ఆరుణాచలం గార్డెన్ పక్కన 5 ఎకరాల స్థలం ఉండేది. దీనికి కృష్ణా గార్డెన్స్ అని పేరు పెట్టారు. ఇందులో ‘ఈనాడు’సినిమా మొదటిసారిగా షూటింగ్ జరుపుకుంది. ఈ సినిమాలో మురికివాడ సెట్స్ ను ఇందులో వేశారు. ఆ తరువాత కొన్ని సినిమాలను కూడా ఇందులో చిత్రీకరించారు.
ఈ ఐదెకరాల్లో చిరంజీవికి ఒక ఎకరం అంతకుముందే కొనుగోలు చేశారు. అయితే చిరంజీవి సినిమాలు మానేసి ప్రజారాజ్యం పార్టీ స్థాపించారు. ఆ తరువాత కొన్ని కారణాల వల్ల ఆ పార్టీని కాంగ్రెస్ లో వీలీనం చేసిన విషయం తెలిసిందే. ఈ సమయంలో చిరంజీవికి భారీగా అప్పులయ్యాయి. వాటిని తీర్చడానికి రూ.25 కోట్ల అవసరం ఏర్పడింది. ఈ క్రమంలో ఆయనకు చెన్నైలో ఉన్న ఎకరం స్థలాన్ని కృష్ణకు అమ్మేశారు. దీంతో వచ్చిన డబ్బుతో అప్పులు తీర్చారు.

చిరంజీవిపై కొన్ని రోజులగా అనేక రూమర్స్ వచ్చాయి. ప్రజారాజ్యం పార్టీపై కొందరు రకరకాల వార్తలు పెట్టారు. ‘గాడ్ పాదర్’ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ నిర్మాత ఎన్ వి ప్రసాద్ ఈ విషయాన్ని ప్రస్తావించారు. చిరంజీవి ఎకరం స్థలం అమ్మి ప్రజారాజ్యం అప్పులు తీర్చారన్నారు. ఈ నేపథ్యంలో ఆ విషయం బయటకు వచ్చింది. అయితే ప్రస్తుతం కృష్ణా గార్డెన్ ను డెవలప్ మెంట్ కు ఇచ్చారు. అందులో పెద్ద అపార్ట్మెంట్ నిర్మించారు.