Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) కెరీర్ లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర'(Vishwambhara Movie). వశిష్ఠ(director vasistha) దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదట్లో అంచనాలు భారీగా ఉండేవి కానీ, టీజర్ విడుదల తర్వాత బాగా తగ్గిపోయింది. కారణం టీజర్ లో చూపించిన గ్రాఫిక్స్ షాట్స్ ఆశించిన స్థాయిలో లేకపోవడమే. ప్రస్తుతం గ్రాఫిక్స్ టీం మొత్తాన్ని మార్చేశారు. కల్కి చిత్రానికి పనిచేసిన టీం ఇప్పుడు ఈ సినిమాకు పని చేస్తుంది. రీ వర్క్ కావడంతో సినిమా పూర్తి అయ్యి మొదటి కాపీ సిద్ధం అవ్వడానికి చాలా సమయం పడుతుంది. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇదంతా పక్కన పెడితే ఈ చిత్రంలో మెగాస్టార్ లుక్స్ అయితే అదిరిపోయాయి. 30 ఏళ్ళ కుర్రాడిగా కనిపిస్తున్నాడంటూ వర్కింగ్ స్టిల్స్ ని చూసిన అభిమానులు చెప్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది.
Also Read : వచ్చే సంక్రాంతి కి చిరంజీవి విన్నర్ గా నిలుస్తాడా..? అనిల్ రావిపూడి ఏం చేయబోతున్నాడు..?
అదేమిటంటే ఈ సినిమాలో మెగాస్టార్ చిరంజీవి ఒక పాట పాడబోతున్నట్టు తెలుస్తుంది. కీరవాణి(MM Keeravani) స్వరపర్చిన ఒక అద్భుతమైన పాటకు చిరంజీవి తన గాత్రాన్ని అందించాడు. గతంలో మెగాస్టార్ మాస్టర్, మృగరాజు చిత్రాల్లో పాటలు పాడాడు. ‘మృగరాజు’ తర్వాత మళ్ళీ చిరంజీవి తనలోని గాయకుడిని బయటకు తీయలేదు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన సింగర్ అవతారం ఎత్తడంతో అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. కీరవాణి సంగీత సారథ్యంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా గతం లో చాలా సినిమాలే వచ్చాయి. అన్ని మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అవ్వడం గమనార్హం. కానీ 2000 సంవత్సరం మొదలైనప్పటి నుండి రీ ఎంట్రీ వరకు వీళ్ళ కాంబినేషన్ లో ఒక్క సినిమా కూడా రాలేదు. ఈ దశకం లో వీళ్ళ కాంబినేషన్ లో వస్తున్న మొదటి చిత్రం ఇదే కావడంతో కీరవాణి తనవైపు నుండి ది బెస్ట్ ఇవ్వడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాడు.
ఈ చిత్రం లో హీరోయిన్ గా త్రిష నటిస్తుండగా, ఆషికా రంగనాథ్, మృణాల్ ఠాకూర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. చోటా కె నాయుడు ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నాడు. టాకీ పార్ట్ మొత్తం పూర్తి అయ్యింది. చిరంజీవి తన తదుపరి చిత్రంలో నటించేందుకు కూడా డేట్స్ ఇచ్చేసాడు. ఉగాది సందర్భంగా చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో ఒక సినిమా మొదలైన సంగతి తెలిసిందే. జూన్ నెల నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మెగాస్టార్ చిరంజీవి లోని వింటేజ్ కామెడీ టైమింగ్ ని బయటకు తీసే విధంగా ఈ చిత్రం రూపొందబోతుంది. ఇందులో హీరోయిన్స్ గా అదితి రావు హైదరీ, పరిణీతి చోప్రా నటించనున్నారు. విక్టరీ వెంకటేష్ కూడా ఈ చిత్రం లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Also Read : చిరంజీవి, అనిల్ రావిపూడి సినిమా మొదలు..వీడియో వైరల్!