Homeఎంటర్టైన్మెంట్షూట్ ఆపొద్దు అంటున్న మెగాస్టార్ !

షూట్ ఆపొద్దు అంటున్న మెగాస్టార్ !

కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో షూట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే.. అంతలో మెగాస్టార్ కి కరోనా వచ్చింది. దాంతో ఆచార్య షూటింగ్ మళ్లీ పోస్ట్ ఫోన్ అవ్వడం ఖాయం అనుకున్నారు అంతా. కానీ మెగాస్టార్ వచ్చే సోమవారం నుండి షూట్ మొదలపెట్టమని.. ముందుగా తానూ లేని సీన్స్ ను ప్లాన్ చేసుకోమని చిరు కొరటాలకు చెప్పారట. దాంతో కొరటాల వచ్చే సోమవారం నుండి […]

Chiranjeevi
కొరటాల శివ – మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ‘ఆచార్య’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. త్వరలో షూట్ స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేసుకుంటే.. అంతలో మెగాస్టార్ కి కరోనా వచ్చింది. దాంతో ఆచార్య షూటింగ్ మళ్లీ పోస్ట్ ఫోన్ అవ్వడం ఖాయం అనుకున్నారు అంతా. కానీ మెగాస్టార్ వచ్చే సోమవారం నుండి షూట్ మొదలపెట్టమని.. ముందుగా తానూ లేని సీన్స్ ను ప్లాన్ చేసుకోమని చిరు కొరటాలకు చెప్పారట. దాంతో కొరటాల వచ్చే సోమవారం నుండి రామోజీ ఫిల్మ్ సిటీలో షూట్ ప్లాన్ చేశాడు. అయితే ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మెగాస్టార్, కొరటాల బలబలాలను బట్టి వీరి సినిమాలో ఉండబోయే అంశాలు పరిశీలిస్తే సినిమా పై రోజురోజుకూ అంచనాలు పెరిగిపోతున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

ముందుగా అభిమానులు కోరుకునే హీరో ఎలివేషన్స్ విషయానికొస్తే.. కొరటాల సినిమాలో సహజంగానే బోలెడంత హీరోయిజమ్ ఉంటుంది. అలాగే మెగాస్టార్ డ్యాన్సులు విషయానికొస్తే తన సినిమాలో మంచి సాంగ్స్, డ్యాన్సులు ఉండేలా చిరు చూస్తారు కాబట్టి.. అదిరిపోయే స్టెప్స్ కూడా ఈ సినిమాలో ఉండబోతున్నాయి. ఇక మెగాస్టార్ కామెడీ చేస్తే చూడాలని అభిమానులు ఎప్పుడూ ఆశిస్తూనే ఉంటారు. అందుకే కొరటాల సినిమాలో కూడా ప్రత్యేకంగా ఓ కామెడీ ట్రాక్ పెట్టారు. అది శ్రీధర్ సిపాన చేత రాయిస్తున్నారు. ఎందుకంటే కొరటాల సినిమాల్లోని హీరోలంతా ఎప్పుడూ సీరియస్ మోడ్ ఆన్ చేసినట్టే ఉంటారనే టాక్ ఉందని.. కామెడీ వరకూ శ్రీధర్ చేత రాయిస్తున్నారు.

Also Read: ఎట్టకేలకు ‘బంగార్రాజు’కి క్లారిటీ ఇచ్చాడు !

ఏది ఏమైనా మెగాస్టార్ – కొరటాల కలయికలో ఒక పవర్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటెర్టైనర్ రాబోతుంది. అన్నట్లు సోమవారం నుండి స్టార్ట్ చేసే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో వరుసగా ఇరవై రోజులు పాటు జరగనుంది. ఆ తరువాత చిరు కూడా షూట్ లో జాయిన్ అవుతారట. మెగాస్టార్ చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్ గా నటిస్తోంది. కాకపోతే సోమవారం మొదలయ్యే షూట్ లో కాజల్ పాల్గొనట్లేదు. ఆమె ప్రస్తుతం హనీమూన్ మూడ్ లో ఉంది. ఇక ఈ చిత్రంలో రామ్ చరణ్ మాజీ నక్సలైట్ గా కనిపిస్తారట. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ లో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఇక సినిమాలో చరణ్ పాత్ర త్యాగం చేసే పాత్రగా ఉంటుందట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper