Chiranjeevi helps Makeup Artist: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , సొంత కష్టం, టాలెంట్ తో పైకి ఎదగాలి అని అనుకునే ప్రతీ యంగ్ హీరో కి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ఎలా అయితే ఆదర్శంగా నిలిచాడో, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడం లో కూడా ఆయన లక్షలాది మందికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. మనం పైకి పోయిన తర్వాత మనం సంపాదించిన డబ్బు ని మనతో పాటు ఒక్క పైసా కూడా తీసుకొని పోలేము, కానీ సంపాదించిన వాటిలో ఎంతో కొంత నలుగురికి పంచితే , వాళ్ళు పంచే ప్రేమ, ఆశీస్సులు మనతో పాటు తీసుకొని వెళ్ళగలం అనే జీవిత సత్యాన్ని మెగాస్టార్ చిరంజీవి తనని అభిమానించే వాళ్లకు నేర్పిస్తున్నాడు. ప్రతీ రోజు ఆయన ఎవరికో ఒకరికి సహాయం చేస్తూనే ఉంటాడు. ఆ సహాయాల్లో కేవలం కొన్ని మాత్రమే బయటకు వస్తుంటాయి.
రీసెంట్ గా ఆయన మరోసారి తన ఉదార మనస్తత్వాన్ని చాటుకున్నాడు. మేకప్ ఆర్టిస్ట్ శివనాధ్ కు 10.5 లక్షలు , మాజీ మేనేజర్ కుటుంబానికి మరో 9.5 లక్షలు విరాళం గా అందించి, ఒక్క వారం లోనే 20 లక్షల రూపాయిల ఆర్ధిక సాయం ని అందించిన వాడిగా నిలిచాడు మెగాస్టార్ చిరంజీవి. మేకప్ ఆర్టిస్ట్ గత శివనాధ్ గత కొద్దీ రోజులుగా తీవ్రమైన అస్వస్థతకు గురయ్యాడు. డాక్టర్లు అత్యవసరంగా ఆయనకు గుండె ఆపరేషన్ చెయ్యాలని సూచించడం , ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి కి తెలిసి తక్షణమే 10.5 లక్షలు పంపడం ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. అదే విధంగా తన దగ్గర పని చేసిన మాజీ మేనేజర్ కి కూడా బై పాస్ సర్జరీ అవసరం అవ్వడం తో మరో 9.5 లక్షలు దానం చేశాడు. రీసెంట్ గానే చిరంజీవి కొన్ని స్వచ్చంద సేవ సంస్థలకు 10 లక్షల రూపాయిలు దానం చేశాడు.
అంతే కాకుండా తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ కి మరో 5 లక్షల రూపాయిల విరాళం అందించాడు. ఇలా తాను కష్టపడి సంపాదించిన డబ్బుల్లో కొంతభాగం ఇలా దానాలు చేసుకుంటూ వెళ్తున్నాడు మెగాస్టార్ చిరంజీవి. ఒక పక్క తమ్ముడు పవన్ కళ్యాణ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తుంటే , మరో పక్క అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి రాజకీయాల్లో లేకపోయినప్పటికీ , తన మనసుకి నచ్చిన సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాడు. తమని అభిమానించి ఇంతటి వాళ్ళను చేసినందుకు అన్నదమ్ములు జనాలకు చూపిస్తున్న ప్రేమ పై మెగా అభిమానులు ఎంతో గర్విస్తున్నారు.