Homeఆంధ్రప్రదేశ్‌Gone Prakash Rao comments on Jagan: అటైనా ఉండు.. ఇటైనా ఉండు.. జగన్ ను...

Gone Prakash Rao comments on Jagan: అటైనా ఉండు.. ఇటైనా ఉండు.. జగన్ ను ఇచ్చి పడేసిన ఆ పెద్దమనిషి

Gone Prakash Rao comments on Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి ( Y S Jagan Mohan Reddy ) తీసుకున్న నిర్ణయాలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నచ్చవచ్చు కానీ.. సీనియర్ రాజకీయ నేతలకు మాత్రం మింగుడు పడడం లేదు. అసలు రాజధానుల స్టాండ్స్ లేదు.. జాతీయస్థాయిలో రాజకీయ విధానాలు లేవు. కనీసం ఎవరు మిత్రులు.. ఎవరు ప్రత్యర్ధులు అని తేల్చుకోలేకపోతున్నారు జగన్. ఇది సహజంగానే రాజకీయాల పట్ల అవగాహన ఉన్నవారికి ఎంత మాత్రం నచ్చదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఖరిపై కూడా ఓ సీనియర్ నేత తన మనసులో ఉన్న మాటను బయట పెట్టేసారు. చాలా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ నేత కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నేతలు సైతం భిన్నంగా కామెంట్లు పెడుతున్నారు.

ఎన్డీఏ కు మద్దతు పలకడంపై..
ఇటీవల పార్లమెంట్లో మహిళా బిల్లును ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దాంతో పాటు డి లిమిటేషన్ బిల్లును ప్రవేశపెట్టింది కేంద్రం. అయితే దానిని ఎన్డీఏ పక్షాలు సమర్ధించాయి. ఇండియా కూటమి పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. కానీ వైయస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఎన్డీఏకు మద్దతు పలకడం జాతీయస్థాయిలో మిగతా రాజకీయ పార్టీలకు ఎంత మాత్రం మింగుడు పడలేదు. చివరకు కెసిఆర్ పార్టీ సైతం వ్యూహాత్మకంగా మౌనం పాటించింది. కానీ కెసిఆర్ స్నేహితుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం మౌనంగా ఉండలేకపోయారు. పైగా విపక్షాలు మద్దతు తెలపక ఈ బిల్లు వీగిపోయింది. దానికి బిజెపి అధికార ప్రతినిధిగా మారిపోయారు జగన్మోహన్ రెడ్డి. విపక్షాల తీరును తీవ్రస్థాయిలో ఎండగట్టారు. అయితే ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి విపరీతంగా విమర్శలకు గురవుతున్నారు. తాజాగా దీనిపై స్పందించారు ప్రముఖ విశ్లేషకుడు గోనె ప్రకాష్ రావు. కాంగ్రెస్ పార్టీలో పనిచేసి.. జగన్మోహన్ రెడ్డి వెంట అడుగులు వేసిన గోనె ప్రకాష్ రావు తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. సమకాలీన రాజకీయ అంశాలపై విశ్లేషిస్తుంటారు.

మూడో ఫ్రంట్ పై సూచనలు
తాజాగా గోనె ప్రకాష్ రావు ( gone Prakash Rao ) జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేశారు. ఇలా అయిన దానికి కాని దానికి ఎన్ డి ఏ బలపరిచింది బదులు.. కెసిఆర్ తో కలిసి మూడో ఫ్రెండ్ ఏర్పాటు చేయవచ్చు కదా అని ఆయన జగన్మోహన్ రెడ్డికి సలహా ఇచ్చారు. ప్రస్తుతం కెసిఆర్ సైతం తటస్థ వైఖరి అనుసరిస్తున్నారు కాబట్టి.. మీకు ప్రత్యామ్నాయం లేదు కాబట్టి.. మూడో ఫ్రెంట్ ఒకటి ఏర్పాటు చేసి జాతీయస్థాయిలో పోరాటం చేయవచ్చు కదా అంటూ సెలవిచ్చారు గోనె ప్రకాష్ రావు. అటు కాక ఇటు కాక ఏంటి అంటూ సెటైర్లు వేశారు. అయితే మగ కావాలి.. లేకుంటే ఆడ కావాలి.. మధ్యరకం వద్దు అంటూ జగన్మోహన్ రెడ్డి పై గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version