Chiranjeevi and Srikanth Odela : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు భారీ సినిమాలను చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే చిరంజీవి (Chiranjeevi) లాంటి నటుడు సైతం 50 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో మెగాస్టార్ గా కొనసాగుతూ తన నట ప్రస్థానాన్ని విస్తరించుకోవడమే కాకుండా 70 సంవత్సరాల వయస్సు లో సైతం భారీ విజయాలను అందుకోవడానికి యంగ్ హీరోలతో పాటు పోటీపడుతున్నాడు. మరి ఇలాంటి చిరంజీవి తను ఫ్యూచర్ లో చేయబోతున్న సినిమాల కోసం కూడా తెగ కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చిరంజీవి నటించబోయే సినిమా వచ్చే ఏడాది జూన్ నుంచి సెట్స్ మీదకి వెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా కోసం చిరంజీవి దాదాపు 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడనే వార్తలైతే వినిపిస్తున్నాయి. ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇప్పుడు చేయబోతున్న సినిమాలు మరొకెత్తుగా మారబోతున్నాయి. ఇక అనిల్ రావిపూడి (Anil Ravipudi) దర్శకత్వంలో చేస్తున్న సినిమా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కాబట్టి ఈ సినిమాని వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Also Read : శ్రీకాంత్ ఓదెల చిరంజీవి తో చేసే సినిమా కోసం అన్ని వందల కోట్ల బడ్జెట్ పెడుతున్నారా..?
ఇక ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత శ్రీకాంత్ ఓదెల సినిమాని స్టార్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల సైతం నానితో ప్యారడైజ్ (Paradaise) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ విజయాన్ని అందుకోవాలనే ఒక దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది…
ఈ సినిమా సూపర్ సక్సెస్ అయిన వెంటనే చిరంజీవితో మరొక సినిమా చేసి భారీ విజయాన్ని అందుకోవాలనే ప్రయత్నంలో శ్రీకాంత్ ఉన్నాడు. మరి చిరంజీవి 60 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటుండగా శ్రీకాంత్ ఓదెల ఒక 20 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. వీళ్ళ రెమ్యునరేషన్స్ కే 100 కోట్లు దాటుతున్నాయి.
ఇక దానికి తోడుగా ప్రొడక్షన్ ఖర్చు కూడా భారీగా పెరిగే అవకాశాలైతే ఉన్నాయి. నాని, సుధాకర్ చెరుకూరి ఇద్దరు కలిసి ఈ సినిమాకు ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. మరి ఇలాంటి సందర్భంలో ఈ సినిమా బడ్జెట్ 200 కోట్లకు పైన అయ్యే అవకాశాలైతే ఉన్నాయి. మరి ఈ సినిమా భారీ సక్సెస్ ను సాధించి భారీ వసూళ్లను రాబడుతుందా లేదా అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాల్సిందే.
Also Read : చిరంజీవి శ్రీకాంత్ ఓదెల సినిమాలో విలన్ గా తమిళ్ స్టార్ హీరో…