Megastar Chiranjeevi- Anasuya Bharadwaj: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మెగాస్టార్ చిరంజీవితో ‘శుభగృహ రియల్ ఎస్టేట్ సంస్థ’ కోసం ఒక యాడ్ చేశాడు. ఈ యాడ్ చేయడానికి చిరంజీవి అంగీకరించడానికి భారీ మొత్తంలో డిమాండ్ చేశాడని రూమర్స్ వినిపిస్తున్నాయి. పైగా ఈ యాడ్ లో తన లుక్ విషయంలో కూడా మెగాస్టార్ చిరంజీవి చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ముఖ్యంగా యాడ్ షూట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీలో సెట్ వేయించారు.
ఇంతకీ మెగాస్టార్ ఈ యాడ్ కోసం ఎంత తీసుకున్నారు ? రియల్ ఎస్టేట్‌కు సంబంధించిన యాడ్ కాబట్టి.. భారీగానే డిమాండ్ చేసి ఉండొచ్చు. ఎంత డిమాండ్ చేసినా.. కొన్ని నిమిషాల వ్యవధి ఉన్న యాడ్ ఇది. ఈ యాడ్ కోసం మెగాస్టార్ రూ.7 కోట్లు తీసుకున్నారట. యాడ్ కోసం ఇంతవరకు ఏ తెలుగు హీరో కూడా ఈ స్థాయిలో పారితోషికం తీసుకోలేదట.
Also Read: Heatwaves: ఎండల తీవ్రతపై ఐఎండీ హెచ్చరిక.. ఈ రెండు వారాలు బయటకు రాకండి..
మరి చిరు కాబట్టి.. ఈ రేంజ్ లో డిమాండ్ చేసి ఉండొచ్చు. ఇక చిరు పక్కన ఎవరు అయితే బాగుంటారు ? మెగాస్టార్ రేంజ్ కి తగ్గ నటిని పెట్టాలి కదా. కానీ సుకుమార్ మాత్రం తనకు ఇష్టమైన అనసూయను తీసుకొచ్చి పెట్టాడు. చిరు పక్కన అనసూయ ఐటమ్ భామలా బాగా ఒదిగిపోయింది. ఇంతకీ అనసూయ ఈ యాడ్ కోసం ఎంత డిమాండ్ చేసింది ?
అనసూయకి 30 లక్షలు ఇచ్చారట. ఒక రకంగా ఇది అనసూయకి చాలా పెద్ద ఎమౌంట్. కానీ.. ప్రస్తుతం ఆమెకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ముప్పై లక్షలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ యాడ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది కూడా. అలాగే సుకుమార్ కూడా దాదాపు 80 లక్షలు తీసుకున్నాడట. అన్నట్టు ఈ యాడ్ పుణ్యమా అని అనసూయ – సుకుమార్ బంధం పై చాలా పుకార్లు షికార్లు చేశాయి.
వీరిద్దరి మధ్య ఏదో ఉంది అని, అందుకే.. అనసూయకి సుక్కు వరుస అవకాశాలు ఇస్తున్నాడు అని ప్రచారం చేస్తున్నారు. నిజంగానే సుకుమార్ స్వయంగా అనసూయను రికమెండ్ చేసి మరీ ఛాన్సులు ఇప్పిస్తున్నాడు. ఈ వ్యవహారం అంతా గమనిస్తోన్న వారు.. ఈ స్టార్ డైరెక్టర్ పుకార్లు పుట్టిస్తున్నారు.
Also Read:Telangana Salaries: తెలంగాణలో ఏపీ సీన్ రిపీట్.. ఏం జరుగుతోంది..?