Prabhas Allu Arjun Remuneration: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కి సోషల్ మీడియాలో ఫుల్ ఫాలోయింగ్ ఉంది. అయితే, పుష్ప తర్వాత ఆ క్రేజ్ రెట్టింపు అయ్యింది. ముఖ్యంగా బన్నీ స్టైల్, ఫైట్స్, డ్యాన్స్ లకు హిందీ ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. మరోపక్క ‘పుష్ప’ను అభిమానులు, సినీ ప్రముఖులే కాదు రాజకీయ నాయకులు కూడా బాగా మెచ్చుకున్న సంగతి తెలిసిందే. అసలు ఎక్కడ చూసిన ‘పుష్ప’ ఫీవరే కనిపించింది ఆ మధ్య.
పైగా ఆ మధ్య పుష్ప సినిమా సృష్టించినంత ప్రభంజనం మరే చిత్రం సృష్టించలేదనే చెప్పాలి. మొన్నటివరకు థియేటర్లలో సందడి చేసి, క్రికెటర్లతోనూ స్టెప్పులేయించిన ఈ సినిమాతో బన్నీ స్టార్ డమ్ నేషనల్ వైడ్ గా పాకిపోయింది. అల్లు అర్జున్ కెరీర్ లోనే ఈ ‘పుష్ప’ సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసి భారీ వసూళ్లను రాబట్టింది.
ఒక్క హిందీ వెర్షన్ లోనే ఈ సినిమా 100 కోట్లకి పైగా రాబట్టడం విశేషం. అయితే, బన్నీ ఈ సారి తన పారితోషికంగా హిందీ వెర్షన్ షేర్ ను అందుకుంటున్నట్టుగా సమాచారం. ఒకవేళ అదే నిజమైతే బన్నీ తీసుకునే పారితోషికం కంటే ఇది ఎక్కువగానే వస్తుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా గతంలో ప్రభాస్ కూడా బాహుబలి 2 సినిమాకి తమిళ షేర్ ను తీసుకున్నారు.
కానీ, బన్నీ మాత్రం హిందీ షేర్ ను తీసుకుంటున్నారు. అంటే.. ప్రభాస్ కంటే . బన్నీనే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్టు. ఏది ఏమైనా ప్రభాస్ తర్వాత టాలీవుడ్ నుంచి హిందీ బెల్టులో అంత క్రేజ్ ఉన్న హీరోగా అల్లు అర్జున్ అవతరించాడని అందరూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పుష్ప చిత్రానికి వచ్చిన రెస్పాన్స్ రీత్యా… బన్నీ పాత హిట్ చిత్రాలు హిందీ వర్షన్ లో కూడా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
మొత్తానికి ‘ఐకాన్ స్టార్’గా ప్రమోట్ అవ్వడానికి రిస్క్ చేసి మరీ నేషనల్ రేంజ్ లో ‘అల్లు అర్జున్’ పుష్ప- ది రైజ్’ సినిమా చేశాడు. అత్యంత ప్రతిష్టాత్మకంగా వచ్చిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో హిట్ అయ్యి బన్నీ రేంజ్ ను రెట్టింపు చేసింది. ప్రస్తుతం ‘పుష్ప పార్ట్ 2’ పై సుకుమార్ కసరత్తులు స్టార్ట్ చేశాడు. ఇంతకీ, సుక్కు – బన్నీ ‘పుష్ప2’ పై ఏం చేయనున్నారు ? అనే కొత్త ప్రశ్నలు సంధిస్తున్నారు నెటిజన్లు.