Heatwaves: ఈ యేడాది ప్రారంభంలోనే ఎండలు మండిపోతున్నాయి. వృద్దులు, చిన్నపిల్లలు బయటకి కాలు పెట్టలేకపోతున్నారు. ఉదయం 11 గంటల నుంచి బయటకు వెళ్లొద్దని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు. ఏప్రిల్ లో తొలి 15 రోజుల పాటు ఎండలు మండిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) హెచ్చరించింది. బుధవారం వరకు పలు ప్రాంతాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉందని ప్రకటించింది.
హిమాలయ పర్వతాల్లో ఉన్నట్టుండి ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయని ఐఎండీ స్పష్టం చేసింది. ఇలాంటి వాతావరణంతో అడవుల్లో కార్చిచ్చు అంటుకునే అవకాశాలు కూడా ఉన్నాయని హెచ్చరించింది. అటవీ శాఖను అప్రమత్తం చేసింది. ఢిల్లీలో కొన్ని ప్రాంతాల్లో ఇటీవల 41 డిగ్రీలకు మించి ఉష్ణోత్రలు నమోదయ్యాయి. 122 ఏళ్ల తర్వాత దేశంలో గత నెలలో అత్యంత గరిష్ఠ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. 1901 తర్వాత మార్చిలో 33.1 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 2010లో నమోదైన 33.09 డిగ్రీల రికార్డూ చెరిగిపోయింది. ఎండల ప్రభావం ఏప్రిల్‌లో ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read: Jagan Delhi Tour: జగన్ ఢిల్లీ పర్యటన వెనక పొలిటికల్ వ్యూహం.. బాబుకు కష్టాలు తప్పవా..?
తెలంగాణలో మార్చిలోనే రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నమోదు అయ్యాయి. ఇప్పటికే కొమురం భీం జిల్లా కెరమెరిలో అత్యధికంగా 43.9, కౌటాలలో 43.7, చెప్రాలలో 43.8 డిగ్రీలుగా నమోదు కాగా.. జైనాథ్‌లో 43.8 డిగ్రీలు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. ఎండ తీవ్రత నేపథ్యంలో ఇప్పటికే సీఎస్ సోమేష్ కుమార్ స్కూల్స్ టైంమ్ కుదించాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో ఎండ తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు.
ఇప్పటికే కలెక్టర్లు, వైద్య ఆరోగ్య శాఖ, డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఆదేశాలు జారీ చేశారు. ఎండ తీవ్రత వల్ల ఏవిధమైన ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకోవాలని, అన్ని జిల్లాల్లో 108 వాహనాలను సిద్ధంగా ఉంచాలని సూచించారు. అలాగే ఉపాధి హామీ కూలీలు ఎండలో పని చేయకుండా చర్యలు చేపట్టాలన్నారు. అగ్నిప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున అగ్నిమాపక శాఖను అప్రమత్తం చేయాలని పేర్కొన్నారు.
Also Read: Chiranjeevi Gang Leader: నాగబాబు చేయాల్సిన గ్యాంగ్ లీడర్ సినిమా చిరంజీవి ఎందుకు చేశాడో తెలుసా..?