Chiranjeevi hand injury: తెలుగు సినిమా ఇండస్ట్రీ కొత్తపుంతలు తొక్కుతూ ముందుకు దూసుకెళ్తుంది. ఇక ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలుగు సినిమాల వైపు చూసే రోజైతే వచ్చింది. ఇండియాలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ని మించిన ఇండస్ట్రీ మరొకటి లేదనేది వాస్తవం… ప్రస్తుతం మన హీరోలందరు భారీ విజయాలను సాధిస్తూ వాళ్లకంటు ఒక ఐడెంటిటిని క్రియేట్ చేస్తున్నారు…ఇక ఇలాంటి క్రమంలోనే హీరోలు చాలా వరకు తమ సినిమాలను చేస్తు ముందుకు సాగుతున్నారు. దానివల్ల కొన్ని సందర్భాల్లో వాళ్లకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని గాయాలు కూడా అవుతున్నాయి… స్టంట్స్ విషయంలోనే కాకుండా వాళ్ళ పర్సనల్ జీవితాల్లో జరిగిన కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్లకు గాయాలైతే అవుతున్నాయి. ముఖ్యంగా మొన్న చిరంజీవి చేతికి పట్టి వేసుకొని కనిపించాడు. అతని చేతికి సర్జరీ అయింది. ఇక ప్రభాస్ సైతం ఫౌజీ సినిమా షూటింగ్లో తీవ్రంగా గాయపడ్డాడనే వార్తలైతే సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయింది.
ఇంతకుముందు జూనియర్ ఎన్టీఆర్ సైతం డ్రాగన్ సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు అతనికి చిన్న గాయమైతే అయింది. మొత్తానికైతే ఇలా హీరోలందరు గాయాల బారిన పడటం వల్ల వాళ్ళ అభిమానులు తీవ్రమైన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాళ్లకు ఎందుకని ఇలా గాయాలు అవుతున్నాయి.
వాళ్ళ సేఫ్టీ గురించి చూసుకోవడం లేదా అని మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.ఇక ఏది ఏమైనా కూడా ఒక సినిమా సక్సెస్ కోసం హీరోలు ఇంతలా కష్టపడతారనే విషయం చాలా మందికి తెలియదు. వాళ్లకి షూటింగ్ లో పాల్గొన్నప్పుడు ఎంత రిస్క్ ఉంటుందనేది వాళ్లకు తగులుతున్న గాయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు…
తద్వారా రాబోయే సినిమాలతో భారీ విజయాలను అందుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని మన హీరోలు ముందుకు దూసుకెళ్తుండటం విశేషం…ఇక ప్రస్తుతం మన స్టార్ హీరోలు అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ లను సాధిస్తారా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…