Chiranjeevi: టికెట్ రేట్లు తగ్గించి జగన్ ప్రభుత్వం సినిమా పరిశ్రమను దెబ్బ కొట్టింది. అయితే, జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పై పెదవి విప్పడానికి కూడా ఏ హీరోకి ధైర్యం సరిపోవడం లేదు. అందుకే ఇప్పటివరకు ఏ తెలుగు స్టార్ హీరో ఈ అంశం పై స్పందించలేదు. అయితే విచిత్రంగా ఇప్పుడు తెలుగు స్టార్ హీరోలంతా జగన్ తో భేటీకి సిద్ధం అయ్యారు. మెగాస్టార్ చిరంజీవి మిగతా పెద్ద హీరోలను కూడా జగన్ దగ్గరకు తీసుకెళ్లడానికి రంగం సిద్ధం చేశారు.

ఈ నెల 10న అమరావతిలో వీరంతా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డితో భేటీ కానున్నారు. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, ప్రభాస్, వెంకటేష్, అల్లు అర్జున్ కూడా చిరంజీవితో కలిసి వెళ్లేందుకు అంగీకరించారని తెలుస్తోంది. ఇక ఎలాగూ వీళ్ళతో పాటు రాజమౌళి, త్రివిక్రమ్, పూరి అలాగే మిగిలిన పెద్ద దర్శకులు కూడా వెళ్ళబోతున్నారు అని టాక్ నడుస్తోంది. ఇప్పటి వరకూ అయితే.. ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలపై ఇంతవరకు వై.ఎస్.జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు.
Also Read: సిరిసిల్ల రివ్యూ.. తారక మంత్రమా.. మహేంద్ర జాలమా.. వచ్చే ఎన్నికల్లో పరిస్థితి ఏంటి..?
మరీ, స్టార్ హీరోలతో జగన్ మీటింగ్ తర్వాత, ఏపిలో సినిమా టికెట్ ధరలను పెంచే అవకాశం ఉందని.. పెద్ద సినిమాలు గట్టెక్కాలంటే జగన్ కచ్చితంగా ఈ విషయంలో సహకరించాలి అని హీరోలు ఒత్తిడి తెస్తారట. మొత్తానికి పెద్ద హీరోలందరూ ఈ మీటింగ్ కి హాజరు అయ్యేలా మెగాస్టార్ చిరంజీవి బాధ్యతని తీసుకున్నారట. కాబట్టి.. ఈ నెల 10న ఈ మీటింగ్ జరగనుంది. ఈ మీటింగ్ తర్వాతే అన్ని పెద్ద సినిమాల విడుదల తేదీలు కూడా పక్కాగా ఖరారు అవుతాయి.

మహేశ్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ లతో పాటు నిర్మాతలు దానయ్య, వంశీ కూడా ఈ భేటీకి హాజరు అయితే.. కచ్చితంగా ఈ మీటింగ్ వర్కౌట్ అవుతుందని టాక్ ఉంది. వాళ్లకు కూడా జగన్ ప్రభుత్వంతో మంచి రిలేషన్ ఉంది. అయితే, సీఎం జగన్ తో భేటీకి జూ ఎన్టీఆర్ సైతం వచ్చేందుకు సిద్దమయ్యారనే వార్త రావడంతో.. వీరి మధ్య జరగనున్న చర్చ పై అటు టీడీపీలోనూ తీవ్ర ఆసక్తి పెరిగింది.

ఎన్టీఆర్ – జగన్ కి మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ మామయ్య ‘నార్నె శ్రీనివాసరావు’ గత ఎన్నికల్లో జగన్ కి సపోర్ట్ చేశారు. అప్పటి నుంచి జగన్, జూనియర్ ఎన్టీఆర్ పట్ల పాజిటివ్ ఫీలింగ్ తో ఉన్నాడని అంటారు. పైగా ఎన్టీఆర్ సన్నిహితులు కొడాలి, వంశీ వైసీపీలోనే ఉన్నారు. అందుకే, ఈ భేటీ పట్ల ఆసక్తి రెట్టింపు అయింది.
Also Read: కమ్యూనిస్టులకు ప్రజాసమస్యలు పట్టవా? టీచర్లపైనే మక్కువ ఎందుకో?