Balakrishna with Marko Director : గత ఏడాది విడుదలైన సినిమాల్లో యాక్షన్ మూవీ లవర్స్ ని విశేషంగా ఆకట్టుకున్న చిత్రం ‘మార్కో'(Marco Movie). ఉన్ని ముకుందన్(Unni Mukundan)(జనతా గ్యారేజ్ విలన్) హీరోగా నటించిన ఈ సినిమా అప్పట్లో ట్రైలర్ తోనే ఆడియన్స్ ని విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పటి యూత్ ఆడియన్స్ ఎక్కువ వయొలెన్స్ సినిమాలను ఆదరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వయొలెన్స్ సన్నివేశాలు హద్దులు దాటి పెట్టేసాడు డైరెక్టర్ హనీఫ్ అదేని(Haneef Adeni). ఆ వయొలెన్స్ సన్నివేశాలను మామూలు ఆడియన్స్ చూడలేరు. CBFC అయితే ఈ సినిమాని టీవీ టెలికాస్ట్ కి నిరాకరించింది. ఓటీటీ లో కూడా ఈ చిత్రాన్ని బ్యాన్ చేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. అంతటి విద్వంసం ఉంటుంది ఈ సినిమాలో. అలాంటి వయొలెంట్ ఆలోచనలు ఉన్న డైరెక్టర్ కి బాలయ్య(Nandamuri Balakrishna) లాంటి ఊర మాస్ హీరో తగిలితే ఎలా ఉంటుందో ఊహించగలరా?.
Also Read : చిరంజీవి సినిమాలో శ్రీలీల ఐటెం సాంగ్..రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు!
బాలయ్య సినిమాల్లో సాధారణంగానే వయొలెన్స్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. ఇక హనీఫ్ కూడా అందుకు తోడు అయితే సెన్సార్ బోర్డు నుండి కూడా ఈ చిత్రానికి ఆమోదం రావడం కష్టమే అనుకుంట. పైగా ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్ క్యారక్టర్ చేస్తున్నాడట. ఇక వయొలెన్స్ మోతాదు ఊహలకు అందవు. రీసెంట్ గానే బాలయ్య బాబు కలిసి హనీఫ్ ఈ సినిమా కథని వినిపించాడట. బాలయ్య స్టోరీ లైన్ చాలా బాగా నచ్చింది. వెంటనే ఈ సినిమా మనం చేస్తున్నాం అని చెప్పేశాడట. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం బాలయ్య బాబు ‘అఖండ 2’ మూవీ షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశలో ఉన్నది. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే ఆయన గోపీచంద్ మలినేని తో ఒక సినిమా చేయబోతున్నాడు. మరో రెండు మూడు రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా జరగనున్నాయి.
ఈ చిత్రం పూర్తి అయ్యాక బాలయ్య హనీఫ్ మూవీ కి డేట్స్ కేటాయిస్తాడని తెలుస్తుంది. ఈ కాంబినేషన్ కేవలం నందమూరి అభిమానుల్లోనే కాదు, బాలయ్య అభిమానుల్లో కూడా అంచనాలు అమాంతం పెంచేసింది. ఇకపోతే ప్రస్తుతం నందమూరి అభిమానులు ‘అఖండ 2’ చిత్రం కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రేపు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ లోనే సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తారట. సెప్టెంబర్ 25 న కానీ, లేకపోతే నవంబర్ లో కానీ ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. చూడాలి మరి ఇది ఎంత వరకు నిజం అవుతుంది అనేది. అఖండ చిత్రం చిన్న పిల్లల దగ్గర నుండి పెద్ద వాళ్ళ వరకు ప్రతీ ఒక్కరిని అలరించింది. ఇప్పుడు ‘అఖండ 2’ చిత్రం అంతకు మించి ఉంటుందని అంటున్నారు మేకర్స్.