https://oktelugu.com/

Chiranjeevi Mohan Raja:‘గాడ్ ఫాదర్’గా చిరంజీవి.. లుక్ వైరల్

ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) 66వ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన కొత్త చిత్రాల అనౌన్స్ మెంట్ లు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు ప్రకటించేశారు. అందులో భాగంగానే మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న చిరంజీవి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు. మెగా అభిమానులకు మరింత బర్త్ డే పండుగను చేసుకునేలా సోషల్ మీడియాలో చిరు బర్త్ డే సందర్భంగా ఆయన […]

Written By:
  • NARESH
  • , Updated On : August 21, 2021 / 06:11 PM IST
    Follow us on

    ఆగస్టు 22.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi ) 66వ పుట్టిన రోజు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన కొత్త చిత్రాల అనౌన్స్ మెంట్ లు వరుసగా క్యూ కడుతున్నాయి. ఇప్పటికే మూడు నాలుగు సినిమాలు ప్రకటించేశారు. అందులో భాగంగానే మోహన్ రాజా దర్శకత్వంలో చేస్తున్న చిరంజీవి సినిమా నుంచి క్రేజీ అప్డేట్ కొద్దిసేపటి క్రితమే విడుదల చేశారు.

    మెగా అభిమానులకు మరింత బర్త్ డే పండుగను చేసుకునేలా సోషల్ మీడియాలో చిరు బర్త్ డే సందర్భంగా ఆయన చిత్రాల ఫస్ట్ లుక్ లు, పోస్టర్లు వెల్లువెత్తుతున్నాయి.

    ‘ఆచార్య’ సినిమాను పూర్తి చేసిన చిరంజీవి ఇప్పుడు రేపు ఆ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. మరోవైపు తాజాగా మోహన్ రాజా దర్శకత్వంలో మలయాళంలో మోహన్ లాల్ హీరోగా సూపర్ హిట్ అయిన ‘లూసీఫర్’ రిమేక్ ను తెలుగులో చేస్తున్నారు. ఆగస్టు 13న ఈ సినిమా షూటింగ్ అఫీషియల్ గా ప్రారంభమైంది. ఈ సినిమాను ఆర్బీ చౌదరి, ఎన్వీ ప్రసాద్ లు సూపర్ గుడ్ ఫిలింస్,కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు.

    చిరంజీవి కోసం ఒరిజినల్ కథలో చాలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేశారు. ‘గాడ్ ఫాదర్’ అనే పేరును ఈ సినిమాకు పెట్టారు. ఈ టైటిల్ చిరంజీవికి అతికినట్టు సూట్ అయ్యింది. హాలీవుడ్ లో, టాలీవుడ్ లోనూ ఈ సినిమా టైటిల్ చాలా పాపులర్. ఇప్పుడు మరోసారి ఇదే టైటిల్ తో చిరు రాబోతుండడం విశేషం.

    https://twitter.com/KonidelaPro/status/1429044181368934411?s=20