Chiranjeevi: పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటిస్తున్న ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu) సినిమా కోసం అభిమానులు నాలుగేళ్ల నుండి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఎన్నో అడ్డంకులను ఎదురుకుంటూ ఎట్టకేలకు షూటింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకునే దశలో ఉన్న ఈ సినిమాని ఈ నెల 28 న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఏడాది ప్రారంభంలోనే ఒక పోస్టర్ ద్వారా అధికారిక ప్రకటన చేసారు. కానీ పవన్ కళ్యాణ్ కి సంబంధించి రెండు సీన్స్ షూటింగ్ బ్యాలన్స్ ఉండడం తో పాటు, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా వరకు మిగిలి ఉండడంతో ఈ నెల విడుదల అవ్వడం అసాధ్యమే అని అంటున్నారు. గత రెండు రోజుల క్రితమే ముంబై లో కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసిన వెంటనే పవన్ కళ్యాణ్ ఇవ్వాల్సిన నాలుగు రోజుల డేట్స్ ని ఇవ్వనున్నాడు. ఈ నెలతో షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కానుంది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన కొత్త విడుదల తేదీ దాదాపుగా ఖరారు అయ్యిందని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్. మే 9 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ భాషల్లో గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారట. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన నేడు, లేదా మరో రెండు రోజుల్లో మేకర్స్ అధికారికంగా చేయనున్నారని టాక్. అయితే మే9 న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) విశ్వంభర(Viswambhara Movie) చిత్రాన్ని విడుదల చేయబోతున్నాడు అంటూ ఇన్ని రోజులు వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. కానీ తమ్ముడి కోసం తన డేట్ ని అన్నయ్య త్యాగం చేసేశాడని తెలుస్తుంది. VFX వర్క్ కూడా చాలా వరకు పెండింగ్ ఉండడం వల్ల విశ్వంభర చిత్రాన్ని వాయిదా వేసినట్టు తెలుస్తుంది. ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఎట్టకేలకు మే9 విడుదల అవ్వబోతున్నందుకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కానీ మెగా ఫ్యాన్స్ మాత్రం నిరాశలో ఉన్నారు.
పవన్ కళ్యాణ్ సినిమా విడుదల అవుతున్నందుకు ఆనందపడాలో, చిరంజీవి సినిమా వాయిదా పడినందుకు బాధపడాలో అర్థం అవ్వని పరిస్థితిలో ఉన్నారు మెగా ఫ్యాన్స్. అయితే ఉప ముఖ్యమంత్రి అయ్యాక పవన్ కళ్యాణ్ నుండి విడుదల కాబోతున్న మొత్త్తమొదటి సినిమా కావడంతో, విడుదల సమయానికి వాళ్ళు కూడా సంబరాల్లో పాల్గొంటారని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ప్రగాఢ విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే ఇప్పటికే ‘హరి హర వీరమల్లు’ రెండు పాటలు విడుదలైన సంగతి తెలిసిందే. మాట వినాలి పాటకు యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ రాగా, రీసెంట్ గా విడుదలైన ‘కొల్లగొట్టినాదిరో’ పాటకు మాత్రం సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. అన్ని మ్యూజిక్ ప్లాట్ ఫార్మ్స్ లో ఈ పాట ట్రెండ్ అవుతుంది. ఇంస్టాగ్రామ్ లో అయితే వేల సంఖ్యలో అభిమానులు రీల్స్ చేస్తూ అప్లోడ్ చేస్తున్నారు. ఈ పాట సినిమాపై కాస్త అంచనాలను కూడా పెంచింది. త్వరలోనే సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో ని విడుదల చేయనున్నారు మేకర్స్.