Chiranjeevi: తెలుగు సినీ చరిత్రలో చిరంజీవి అంటే ప్రత్యేకమైన గుర్తింపు ఉంటుంది. ఎలాంటి అండ లేకుండానే స్వశక్తితో ఎదిగిన చిరంజీవి జీవితమంటే అందరికి ఆదర్శమే. అందుకే ఆయనను నమ్ముకుని చాలా మంది ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. ఇక ఆయన కుటుంబం నుంచి కొడుకుల నుంచి అల్లుళ్ల వరకు అందరు తమదైన శైలిలో దూసుకుపోతున్నారు. తెలుగు సినిమాకు పెద్దదిక్కుగా మారిన చిరంజీవి ప్రస్థానం చూస్తే మనకే ఆశ్చర్యం వేస్తోంది. పేదవాడిగా సినిమాల్లో రంగ ప్రవేశం చేసి నేడు ఎంతో ఎత్తుకు ఎదిగిన మహనీయుడు. కొత్తగా వచ్చే వారందరికి రోల్ మోడల్ కావడం నిజంగా ప్రశంసనీయమే.
ఆయన ఈ స్థాయికి రావడానికి అవిరళ కృషి, అకుంఠిత దీక్ష, పట్టుదల ఉన్నాయి. ఎదగాలనే తపనలో ఎన్నో సంవత్సరాలు కష్టపడి పైకొచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి నమ్మేది ఒక్కటే. కష్టపడి పని చేస్తే గుర్తింపు దానంతట అదే వస్తుంది. మొదట మనం ఒళ్లు వంచి పని చేయాలి అని చెబుతుంటారు. గుర్తింపు రావడానికి సమయం పట్టవచ్చు. కానీ వచ్చుడు ఖాయమే అని సూచిస్తున్నారు. అవకాశాలు అందిపుచ్చుకోవడం కాదు వాటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఎదిగేందుకు ప్రయత్నించాలి. అప్పుడే మనం అనుకున్నది సాధిస్తాం అని చెబుతుంటారు.
Also Read: Captain Chalapati Choudhary : ఎన్టీఆర్ పై అభిమానం.. నూతన్ ప్రసాద్ తో సాన్నిహిత్యం !
చిరంజీవికి ముగ్గురు పిల్లలు. చరణ్, సుష్మిత, శ్రీజ. చిరుకు మాత్రం శ్రీజ అంటే ప్రత్యేకమైన గారాభం ఉంటుంది. ఇక తన జీవితంలో ఎప్పటికి మరిచిపోని వాళ్లు ఇద్దరు అని ఎప్పుడు చెబుతుంటారు. తల్లి అంజనమ్మ, భార్య సురేఖ లేకపోతే తాను లేనని మనసులోని మాట బయట పెట్టారు. వారు నా ఎదుగుదల కోసం నిర్విరామంగా కష్టపడ్డారు. ఇంటిని చూసుకుంటూ తనకు సపోర్టుగా నిలవడంతోనే తాను ఈ స్థాయికి వచ్చానని గర్వంగా ఫీలవుతారు.
చిరంజీవి ఇప్పటికి కూడా వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ ఓ స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. మధ్యలో రాజకీయాల్లో చేరి విరామం తీసుకున్నా ప్రస్తుతం నిర్విరామంగా కృషి చేస్తున్నారు రోజురోజుకు తన నటనలో మార్పులు చేసుకుంటూ కుర్ర హీరోలతో పోటీ పడుతున్నారు. ఈ తరం హీరోలకంటే తీసిపోని విధంగా తన నటనతో నిరూపిస్తున్నారు. వయసు పైబడినా ఎక్కడ కూడా ఆ ఛాయలు కనిపించకుండా జాగ్రత్త పడుతున్నారు. తెలుగు సినిమాను చక్రవర్తిలా ఏలుతున్నారు.
ఆచార్య సినిమా నిరుత్సాహ పరిచినా రాబోయే సినిమా దాన్ని తలదన్నేలా ఉండాలని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కథనంలో కొత్తదనం ఉండేలా చూసుకుంటున్నారు. దర్శకుల ప్రతిభ మీద నమ్మకంతో తీసిన ఆచార్య బెడిసికొట్టడంతో కాస్తంత నిరుత్సాహానికి గురయ్యారు. ఆచార్య మొత్తం కలెక్షన్ల మీద దెబ్బ కొట్టింది. దీంతో ఏం చేయాలో పాలుపోని చిరంజీవి తరువాత వచ్చే సినిమాలు అలా ఉండకూడదని అనుకుంటున్నారు. దర్శకుల ప్రతిభ కాకుండా కథ, కథనం బాగుండాలని మరింత శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
Also Read:Anupama parameswaran: అవకాశాల కోసం ‘అనుపమ’ అందాల విందు.. హాట్ పిక్స్ వైరల్
Recommended Videos