Chiranjeevi: ఇప్పటివరకు చిరంజీవి చేసిన చాలా సినిమాలు తనను నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలబెట్టాయి. ఇకమీదట కూడా ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. పాన్ ఇండియా ప్రేక్షకులను సైతం తన వైపు తిప్పుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. 70 సంవత్సరాల వయసులో కూడా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ ముందుకు సాగుతున్నాడు అంటే మామూలు విషయం కాదు. ఇప్పటివరకు ఆయన సాధించిన విజయాలు అతన్ని నెక్స్ట్ లెవెల్ హీరోగా నిలబెట్టాయి. మరి ఇక మీదట కూడా ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంవత్సరం ఇప్పటికే మన శంకర్ వరప్రసాద్ సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించాడు. ఇక బాబీ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలకు కూడా తను కమిట్ అయినట్టుగా వార్తలైతే వినిపిస్తున్నాయి… శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేయబోతున్న సినిమాతో పాటుగా మరోక సినిమాకి సైతం తను కమిట్ అయినట్టుగా తెలుస్తుంది. తమిళ్ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడట. ఇక ఇప్పటికే వీళ్ళ కాంబినేషన్లో ‘గాడ్ ఫాదర్’ అనే సినిమా వచ్చింది.
ఈ సినిమా అనుకున్న రేంజ్ లో ఆడలేదు. ఇక వీళ్ళ కాంబోలో మరో సినిమా కూడా రాబోతుందనే వార్తలైతే వస్తున్నాయి. మొత్తానికైతే మోహన్ రాజా ఈ సినిమాతో చిరంజీవికి ఒక భారీ సక్సెస్ ని కట్టబెట్టాలనే ప్రయత్నంలో ఉన్నాడు. మొత్తానికైతే తను అనుకున్నట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవల్ విజయాన్ని సాధిస్తుందా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
ఇక ఈ ఏజ్ లో కూడా చిరంజీవి యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ చాలా మంచి లైనప్ ను సెట్ చేసుకున్నాడని చాలామంది కొనియాడుతున్నారు. ఇప్పుడున్న కుర్ర హీరోలకి కూడా సాధ్యం కానీ రీతిలో మూవీస్ చేస్తూ ముందుకు సాగుతున్నాడు. చిరంజీవి తన స్టార్ డమ్ ను అంతకంతకు విస్తరించుకుంటు ఇప్పటికే తనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండాలనే తపనతో వర్క్ చేస్తున్నాడు…