Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) 7 పదుల వయస్సులో కూడా కుర్రాళ్ల కంటే ఫాస్ట్ గా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకుపోతున్నాడు. ఈ వయస్సులో ఆయన ఏర్పాటు చేసుకుంటున్న కాంబినేషన్స్ ని చూస్తే ఎవరికైనా మతి పోవాల్సిందే. ఆయన తనయుడు రామ్ చరణ్ కూడా ఈ రేంజ్ ప్లానింగ్ తో లేడు. రీ ఎంట్రీ తర్వాత అత్యధికంగా రీమేక్ సినిమాలు చేయడం తో చిరంజీవి మార్కెట్ నైజాం, ఓవర్సీస్ వంటి ప్రాంతాల్లో కాస్త తగ్గింది. అందుకే ఇక నుండి ఆయన రీమేక్ సినిమాలకు దూరంగా, కేవలం తన వయస్సుకి తగ్గ పాత్రలను ఎంచుకుంటూ వరుసగా స్టార్ డైరెక్టర్స్ తో క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన విశ్వంభర మూవీ(Viswambhara Movie) షూటింగ్ లో ఫుల్ బిజీ గా ఉన్నాడు. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే విడుదల కాబోతుంది.
Also Read : మెగాస్టార్ చిరంజీవి పల్లెబాట..కారణం ఏమిటంటే!
ఈ చిత్రం తర్వాత ఆయన అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఒక కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా చేయబోతున్నాడు. జూన్ నుండి ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లనుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లాక్ అయ్యిందట. ఈ సినిమా పూర్తి అయిన వెంటనే ఆయన శ్రీకాంత్ ఓదెల తో ఒక సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమాకి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించబోతున్నాడు. ఇవన్నీ పక్కన పెడితే సందీప్ రెడ్డి వంగ రీసెంట్ గానే చిరంజీవి ని అనేక సందర్భాల్లో కలిసి ఒక పవర్ ఫుల్ స్టోరీ లైన్ ని వినిపించాడట. అందుకు మెగాస్టార్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది. అదే విధంగా తనకు ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ని అందించిన బాబీ తో కూడా ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది.
ఇలా సినిమా తర్వాత సినిమా, వరుసగా ఐదేళ్ల పాటు చిరంజీవి కాల్ షీట్స్ మొత్తం ఫుల్ అయిపోయాయి. ఇంత బిజీ గా రామ్ చరణ్(Global star Ram charan) కూడా లేడు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చి బాబు తో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ చిత్రం తర్వాత కేవలం సుకుమార్ సినిమాకు మాత్రమే కమిట్ అయ్యి ఉన్నాడు. ఆ తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడు అనే దానిపై ఎవరికీ క్లారిటీ లేదు. కానీ చిరంజీవి వరుసగా ఐదు సినిమాలను సెట్ చేసుకొని క్షణం తీరిక లేకుండా గడిపే ప్లాన్ లో ఉన్నాడు. ఇంత ప్లానింగ్ తో కేవలం రామ్ చరణ్ మాత్రమే కాదు, ఇతర స్టార్ హీరోలు కూడా లేరు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఈ వయస్సులో కూడా పని చేయాలనే కసి ఎంతమందికి ఉంటుంది చెప్పండి. అందుకే చిరంజీవి ని మెగాస్టార్ అని అంటుంటారు.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో సాంగ్ పాడనున్న లెజెండరీ సింగర్…