Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ‘పల్లెబాట’ పట్టడం ఏమిటి?, మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాడా?, నిన్న గాక మొన్ననే రాజకీయాల్లోకి రాను అన్నాడు కదా, మళ్ళీ ఇదేంటి అని మీరు అనుకోవచ్చు. కానీ ఆయన పల్లెబాట పడుతున్నది రాజకీయాల కోసం కాదు, సినిమా కోసం. రీసెంట్ గానే ఆయన అనిల్ రావిపూడి(Anil Ravipudi) తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ శరవేగంగా సాగుతుంది. ఇప్పటికే ఫస్ట్ హాఫ్ కి సంబంధించిన స్క్రిప్ట్ పనులు మొత్తం పూర్తి అయ్యాయట. ఈ సినిమా కథ పల్లెటూరి నేపథ్యం లో ఉంటుందట. చిరంజీవి ని రూరల్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తే చూడాలని అభిమానులు చాలా కాలం నుండి కోరుకుంటున్నారు. ఎందుకంటే గతంలో ఆయన ఆ బ్యాక్ డ్రాప్ లో చేసిన సినిమాలన్నీ కమర్షియల్ గా సెన్సేషన్ సృష్టించాయి.
Also Read : చిరంజీవి అనిల్ రావిపూడి సినిమాలో సాంగ్ పాడనున్న లెజెండరీ సింగర్…
చిరంజీవి సినీ జీవితాన్నే మార్చేసిన ‘ఖైదీ’ చిత్రం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమానే. ఈ సినిమాకి ముందు కూడా ఆయన ఈ నేపథ్యంలో అనేక సూపర్ హిట్ సినిమాలు చేసాడు. మళ్ళీ ఇన్నాళ్లకు ఆయన పల్లె బాట పట్టనున్నాడు. ఈ సినిమాలో మెగాస్టార్ నుండి అభిమానులు ఏవైతే మిస్ అవుతున్నారో, అవన్నీ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. కామెడీ చేయడం లోనూ, ఎమోషనల్ సన్నివేశాల్లో కన్నీళ్లు రప్పించడం లోనూ మెగాస్టార్ చిరంజీవి సాటి మరో హీరో లేడు. కానీ రీ ఎంట్రీ తర్వాత అభిమానులు ఆయనలో ఈ రెండు కోణాలను బాగా మిస్ అవుతున్నారు. ‘వాల్తేరు వీరయ్య’ లో అక్కడక్కడా కామెడీ చేసినప్పటికీ, అది పూర్తి స్థాయి మెగాస్టార్ కామెడీ టైమింగ్ కాదు అనే చెప్పాలి. అందుకే ఈసారి ఆయనతో పొట్టచెక్కలు అయ్యే కామెడీ సబ్జెక్టు ని అనిల్ రావిపూడి తయారు చేస్తున్నట్టు తెలుస్తుంది.
రీసెంట్ గానే ఆయన మెగాస్టార్ ని కలిసి ఫస్ట్ హాఫ్ మొత్తం వినిపించాడట. చిరంజీవి స్క్రిప్ట్ మొత్తం విని పగలబడి నవ్వినట్టు తెలుస్తుంది. ఒక సినిమాని ఆయన కథ వైన్ స్టేజిలోనే ఈ రేంజ్ లో నవ్వుకోవడం అనేది ఇప్పటి వరకు జరగలేదట. నేటి తరం ఆడియన్స్ పల్స్ కి తగ్గట్టు, అద్భుతమైన కామెడీ టైమింగ్ ని డిజైన్ చేయడంలో అనిల్ రావిపూడి తర్వాతనే ఎవరైనా. ఈ సినిమాలో కూడా కుళ్లిపోయిన, మాడిపోయిన కామెడీ టైమింగ్ ఉన్న సన్నివేశాలు కాకుండా, స్వచ్ఛమైన కామెడీ ని డిజైన్ చేసినట్టు తెలుస్తుంది. ఈ ఏడాది జూన్ లో నెలలో షూటింగ్ ని మొదలు పెట్టి, మూడు నెలల్లోనే షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ చిత్రం లో హీరోయిన్స్ గా అదితి రావు హైదరీ, భూమిక నటిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి కూడా సంగీతం అందించబోతున్నాడు.
Also Read : చిరంజీవికి తమ్ముళ్ల కంటే ఆయనే ఎక్కువా?… నిజమే అని ఒప్పుకున్న నాగబాబు, ఆ కథేంటి?