Nagarjuna- Allu Arjun : తెలుగు సినిమా ఇండస్ట్రీకి రాజకీయ నాయకులకు మధ్య మంచి సన్నిహిత సంబంధాలు అయితే ఉంటూ వస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాల నుంచి రాజకీయ నాయకులకు తెలుగు సినిమా ఇండస్ట్రీకి అవినాభావ సంబంధమైతే ఉంది. కొంతమంది సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, ప్రొడ్యూసర్లు, దర్శకులు సైతం రాజకీయాల్లో పాల్గొని ముఖ్యమంత్రి గా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, మంత్రులుగా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. మరి ఇలాంటి సందర్భంలో ఇప్పుడు తెలంగాణ సీఎం అయిన రేవంత్ రెడ్డి మాత్రం తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద దురుసు వైఖరితో ప్రవర్తిస్తున్నాడు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి… ఇక దానికి కారణం ఏంటి అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగా హీరోలు రెస్పాండ్ అవ్వడం లేదనే ఉద్దేశ్యంతోనే ఆయన ఒక తీవ్రమైన డిసిజన్స్ ని తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది…ఇక ఇదిలా ఉంటే కొన్ని రోజుల క్రితం నాగార్జున ఎన్ కన్వెన్షన్ విషయంలో కూడా ఆయన ఎక్కడ ఎవరి మాట వినకుండా హైడ్రా భాగంగా దానిని కూల్చివేసిన విషయం మనకు తెలిసిందే. ఇక అది మరవకముందే ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ రోజున సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కేసిలాట లో రేవతి అనే మహిళ మృతి చెందింది.
ఇక దానికి అనుగుణంగానే అల్లు అర్జున్ మీద కూడా ఆయన కఠిన వైఖరిని చాటుకుంటున్నాడు. ఇక ఈ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నాయి. నిజానికి అల్లు అర్జున్ లాంటి ఒక స్టార్ హీరో ఒకరోజు జైల్లో ఉండి వచ్చినంత మాత్రాన పోయేది ఏమీ లేదు. కానీ అతన్ని పనిగొట్టుకొని హీరోలు, రాజకీయ నాయకులు సైతం పరామర్శిస్తున్నారు.
జైల్లో ఉన్నందుకు ఆయనని ఎందుకు పనమర్శించాలి అంటూ అసెంబ్లీ సాక్షిగా ఆయన ఫైర్ అయ్యారు. మరి మొత్తానికైతే ఆయన అలా ఫైర్ అవ్వడం వెనక కారణాలు ఏంటి అంటే నాగార్జున ఇంతకుముందు బిఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీని కొంతవరకు చులకన భావంతో చూశాడట. దానివల్లే నాగార్జున విషయంలో ఎన్ కన్వెన్షన్ ని కూల్చివేయడానికి కారణమైంది.
ఇక ఇప్పుడు రీసెంట్ గా అల్లు అర్జున్ సైతం రేవంత్ రెడ్డి పేరును మర్చిపోవడం, అలాగే గవర్నమెంట్ కు సంబంధించిన కొంతమంది కీలక వ్యక్తులతో అతను దురుసుగా ప్రవర్తించాడనే వార్తలు తన దాకా వెళ్ళాయట. అందువల్లే అల్లు అర్జున్ నాగార్జున విషయంలో ఆయన కఠిన చర్యలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది… చూడాలి మరి ఈ ఇష్యూ ఎక్కడి వరకు వెళ్తుంది అనేది…