Chiranjeevi: కృష్ణ వదిలేసిన ఈ సినిమాతో చిరంజీవికి లైఫ్‌.. ఆ సినిమా ఏంటో తెలుసా?

1983లో డైరెక్టర్‌ కోదండ రామిరెడ్డి హీరో కృష్ణకు ఖైదీ సినిమా కథను వినిపించారు. అప్పటికే కృష్ణ ఫుల్‌ బిజీగా ఉన్నారు. అయినా కృష్ణ కోసం కొన్ని నెలలు వెయిట్‌ చేశారు.

Written By: Raj Shekar, Updated On : September 23, 2023 12:53 pm
Follow us on

Chiranjeevi: సూపర్‌ స్టార్‌ కృష్ణ.. పరిచయం అక్కరలేని పేరు.. 300పైగా సినిమాల్లో నటించిన ఈ నట శేఖరుడు… ప్రస్తుత స్టార్‌ హీరో మహేశ్‌బాబు తండ్రి కూడా. 1960 నుంచి 1990 వరకు దాదాపు మూడు దశాబ్దాలు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం, గుర్తింపు తెచ్చుకున్నారు కృష్ణ. అలనాటి అగ్ర నటుల్లో ఎన్టీఆర్, ఏఎన్‌ఆర్‌ తర్వాతి స్థానం కృష్ణదే అంటే అతిశయోక్తి కాదు. ఎన్నో సూపర్‌ హిట్‌ సినిమాల్లో హీరోగా నటించడంతోపాటు పలు సినిమాలకు స్వయంగా నిర్మించారు. దర్శకత్వం కూడా వహించాడు. తన సూపర్‌ హిట్‌ సినిమాలతో తెలుగు సినిమాలో ఓ ట్రెండ్‌ క్రికెట్‌ చేశారు కృష్ణ. అలాంటి కృష్ణ ఓ సినిమాను వదిలేశారు. సెలెక్టెడ్‌గా సినిమాలను ఎంచుకునే కృష్ణ వదిలేసిన ఆ సినమా మెగాస్టార్‌ చిరంజీవికి ఇండస్ట్రీలో లైఫ్‌ ఇచ్చింది. కృష్ణ చేయాల్సిన సినిమాను చిరంజీవి… చిరంజీవి చేయాల్సిన సినిమాను కృష్ణ చేశారు. ఈ రెండు సినిమాలు బ్లాక్‌ బస్టర్లుగా నిలిచాయి. ఇంతకీ ఆ సినిమాలేవి? ఒకరి సినిమా ఇంకొకరికి ఎలా వెళ్లిందో తెలుసుకుందాం.

కథ నచ్చినా.. డేట్స్‌ కుదక..
1983లో డైరెక్టర్‌ కోదండ రామిరెడ్డి హీరో కృష్ణకు ఖైదీ సినిమా కథను వినిపించారు. అప్పటికే కృష్ణ ఫుల్‌ బిజీగా ఉన్నారు. అయినా కృష్ణ కోసం కొన్ని నెలలు వెయిట్‌ చేశారు. అయినా షెడ్యూల్‌ డేట్స్‌ కుదరకపోవడంతో అదే కథను కోదండ రామిరెడ్డి చిరంజీవికి వినిపించాడు. అప్పుడప్పుడే ఎదుగుతున్న చిరంజీవి ఈ సినిమాకు ఓకే చెప్పడంతో అది కాస్త చిరు కెరీర్‌లో బెస్ట్‌ మూవీగా నిలిచింది.

కృష్ణారెడ్డిపై అనుమానంతో..
ఇక 1993లో ఎస్‌వీ.కృష్ణారెడ్డి అన్నయ్య అనే సినిమా కథను చిరంజీవికి వినిపించాడు. చిరుకు స్టొరీ నచ్చింది కానీ తనను కృష్ణారెడ్డి ఎలా హ్యాండిల్‌ చేస్తాడనే ఆనుమానంతో ఆ సినిమాను వదులుకున్నాడు. తర్వాత అదే కథ కృష్ణకు చేరింది. అప్పటికే వరుస ప్లాప్‌లతో ఉన్న కృష్ణ ఈ ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పాడు. అన్నయ్య అనే టైటిల్‌తో ఆల్రెడీ కృష్ణ సినిమా చేసి ఉండడంతో ఆ టైటిల్‌ను నంబర్‌ వన్‌గా మార్చారు. ఇది కూడా సూపర్‌ హిట్‌గా నిలిచింది. ఇలా కృష్ణ వదిలేసిన ఆ సినిమా చిరుకు లైఫ్‌ ఇస్తే, చిరు వదిలేసిన ఆ సినిమా కృష్ణకు మళ్లీ బ్రేక్‌ ఇచ్చింది.