Chiranjeevi And Kamal Haasan: తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఏ రేంజ్ గుర్తింపు ఉందో తమిళ్ సినిమా ఇండస్ట్రీలో రజనీకాంత్ – కమల్ హాసన్ ఇద్దరికీ అదే రేంజ్ గుర్తింపైతే ఉంది. చిరంజీవి డిఫరెంట్ సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉంటాడు. రజినీకాంత్ మాత్రం మాస్ లో విపరీతమైన ప్లాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు. కమల్ హాసన్ మాత్రం క్లాస్ సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…ఇక రజినీకాంత్ – చిరంజీవి కలిసి సినిమా చేయాలని చాలా సందర్భాల్లో అనుకున్నారు. కానీ అది కార్య రూపం దాల్చలేదు. కమల్ హాసన్ – చిరంజీవి సైతం ఒక సినిమాలో నటించాలని చాలావరకు ప్రయత్నం చేసిన కూడా అది కుదరలేదు. ఇక ఏది ఏమైనా కూడా వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వచ్చి ఉంటే ఆ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేసేది అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లు చేస్తూ ఉంటారు… ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీని శాసించిన చిరంజీవి ఇప్పటికి మెగాస్టార్ గానే కొనసాగుతున్నాడు.
అతని ప్లేస్ ని భర్తీ చేయగలిగే హీరో ఇంకెవరు లేరని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి చిరంజీవి కమలహాసన్ తో పోటాపోటీగా నటించి ఉంటే ఆ సినిమా పలు రికార్డులను క్రియేట్ చేసి ఉండేదని సినిమా విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు… కమల్ హాసన్ లాంటి నటుడు ఇండియాలోనే ఇంకెవరు ఉండరు అంటూ గొప్ప బిరుదును పొందిన ఆయన ఇప్పటికి సినిమా కోసం చాలా వరకు కష్టపడుతూ ఉంటాడు.
ఒక టైమ్ లో చిరంజీవి – కమల్ హాసన్ ఇద్దరు కలిసి నటించాలని అనుకొని కొంతమంది రైటర్లను పిలిచి మరి వాళ్ళ కోసం కథలను రెడీ చేయమని చెప్పారట. అయినప్పటికి ఆ రైటర్లు రెడీ చేసిన కథలు వీళ్ళిద్దరికి నచ్చకపోవడంతో ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక ఫ్యూచర్లో అయిన వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఇక ప్రస్తుతం రజనీకాంత్ – కమల్ హాసన్ కాంబినేషన్లో ఒక సినిమా వస్తున్న విషయం మనకు తెలిసిందే. తొందర్లోనే ఆ సినిమా సెట్స్ మీదకి వెళ్ళబోతోంది.
ఇక వీళ్ళిద్దరిని ఒకే స్క్రీన్ మీద చూడాలని యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ ఆసక్తి చూపిస్తుంది. ఈ సినిమా భారీ రికార్డులను క్రియేట్ చేస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…ఇక చిరంజీవి కమల్ హాసన్ కాంబోలో సినిమా కోసం ఎదురుచూస్తుంటే రజినీకాంత్ కమల్ హాసన్ కాంబోలో సినిమా సెట్ అయింది…