Rajinikanth Dream Project: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో గత 50 సంవత్సరాలుగా నెంబర్ వన్ పొజిషన్ లో ముందుకు సాగుతున్న నటుడు రజనీకాంత్…ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ప్రేక్షకులను అలరిస్తుంది. ఈ ఏజ్ లో కూడా ఆయన ఎక్కడ తడబడకుండా యంగ్ హీరోలకు పోటీని ఇస్తూ వరుస సినిమాలను చేస్తున్నాడు అంటే తనకి సినిమాలంటే ఎంత ఇష్టమో మనం అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ‘జైలర్ 2’ సినిమాని చేస్తున్న ఆయన ఈ సినిమాతో సంచలన రికార్డులను క్రియేట్ చేయాలని చూస్తున్నాడు. గత సంవత్సరం వచ్చిన కూలీ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించకపోవడంతో రజినీకాంత్ కొంత వరకు డీలా పడ్డాడు. అయినప్పటికి ‘జైలర్ 2’ సినిమాతో మరోసారి తన నట విశ్వరూపాన్ని చూపించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమాతో భారీ విజయాన్ని అందుకుంటే మాత్రం తన దూకుడుని ఆపే వారెవరు ఉండరనేది వాస్తవం… ఇప్పటివరకు అన్ని ఇండస్ట్రీల్లో ఉన్న సీనియర్ హీరోలతో పోలిస్తే రజినీకాంత్ ముందు వరుసలో ఉన్నాడు. తన కూలీ సినిమా 500 కోట్లకు పైన కలెక్షన్స్ ని కొల్లగొట్టింది.
ఒక ఫ్లాప్ సినిమాతోనే ఆ రేంజ్ కలెక్షన్స్ ని రాబట్టాడు అంటే జైలర్ 2 సినిమా సక్సెస్ ఫుల్ టాక్ ను సంపాదించుకుంటే మాత్రం అతను ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయడమే కాకుండా 1000 కోట్లకు పైన కలెక్షన్స్ ని రాబట్టగలిగే కెపాసిటి కూడా అతనికి ఉందని నిరూపించినవాడవుతాడు…
ఇక రజనీకాంత్ తన హెల్త్ విషయంలో ఇబ్బంది పడుతున్నప్పటికి సినిమా కోసం వాటన్నింటిని లెక్కచేయకుండా ముందుకు సాగుతున్నాడు. తన చివరి శ్వాస వరకు ఇండస్ట్రీలోనే కొనసాగుతానని తన కోరికను తెలియజేశాడు. ఈ ఏజ్ లో సైతం అతను ఒక పౌరాణిక సినిమాలో నటిస్తే బాగుండు అంటూ తన డ్రీమ్ ప్రాజెక్టు గురించి తెలియజేస్తున్నాడట.
మరి తొందరలోనే ఆ ప్రాజెక్టు పట్టలెక్కుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది. అతని ఏ పాత్రలో చేయబోతున్నాడు అనే విషయం మీద ఇంకా క్లారిటీ రాలేదు. కానీ కొంతమంది దర్శక నిర్మాతలు ఆ సినిమాను చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది…