https://oktelugu.com/

Andrea Jeremiah: శారీరకంగా మానసికంగా వేధించాడు, ఎఫైర్ పెట్టుకుని తప్పు చేశా… ఆండ్రియా షాకింగ్ కామెంట్స్

నటి కమ్ సింగర్ ఆండ్రియా వివాదాలతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది. తాజాగా ఆమె తన ఎఫైర్స్ బయటపెట్టారు. ఓ వివాహమైన వ్యక్తితో సంబంధం పెట్టుకుంటే, అతడు మానసికంగా, శారీరకంగా వేధించాడని ఆమె అన్నారు. ఆండ్రియా కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి.

Written By:
  • Vicky
  • , Updated On : September 16, 2024 / 05:29 PM IST

    Andrea Jeremiah

    Follow us on

    Andrea Jeremiah: పచ్చైకిలి ముత్తుచరమ్ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది ఆండ్రియా జెర్మియా, ఈమె నటించిన యుగానికి ఒక్కడు తెలుగులో కూడా బాగా ఆడింది. ఆ విధంగా టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఆండ్రియా పరిచయమే. అనంతరం తెలుగులో తడాఖా చిత్రం చిత్రం చేసింది. సునీల్ కి జంటగా నటించింది. ఈ ఏడాది విడుదలైన సైంధవ్ చిత్రంలో ఓ కీలక రోల్ చేసింది. వెంకటేష్ 75వ చిత్రంగా తెరకెక్కిన సైంధవ్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. ప్రస్తుతం నటిగా, సింగర్ గా ఆండ్రియా రాణిస్తుంది.

    కాగా సుచి లీక్స్ వ్యవహారంలో ఆండ్రియా పేరు ప్రముఖంగా వినిపించింది. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ తో ఆమె సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. అనిరుధ్ తో ఆమె ఎఫైర్ పెట్టుకున్నారంటూ వార్తలు వచ్చాయి. సుచి లీక్స్ ఉదంతంలో ధనుష్, రానా, త్రిష తో పాటు పలువురు సెలెబ్స్ బుక్ అయ్యారు. ఇదిలా ఉండగా గతంలో తాను ఓ వ్యక్తితో ఎఫైర్ నడిపినట్లు ఆండ్రియా స్వయంగా చెప్పడం సంచలనం రేపుతోంది.

    ఆండ్రియా మాట్లాడుతూ.. గతంలో నేను పెళ్ళైన ఓ వ్యక్తితో ఎఫైర్ పెట్టుకున్నాను. అతడు నన్ను శారీరకంగా, మానసికంగా వేధించాడు. అతడి వేధింపులు తట్టుకోలేక డిప్రెషన్ కి గురమయ్యాను. ప్రస్తుతం అతనికి దూరంగా ఉంటున్నాను, అని అన్నారు. ఆ పెళ్ళైన వ్యక్తి ఎవరు అనేది ఆండ్రియా చెప్పలేదు. అలాగే తనకు వివాహం చేసుకునే ఆలోచన లేదని ఆమె తేల్చి చెప్పింది. సింగిల్ గా లైఫ్ హ్యాపీగా ఉంది. పెళ్లి చేసుకోవాలని అనుకోవడం లేదని ఆమె అన్నారు .

    ప్రస్తుతం ఆండ్రియా పిశాచి 2, నో ఎంట్రీ అనే చిత్రాల్లో నటిస్తుంది. పిశాచి 2 అనుకోని కారణాలతో వాయిదా పడింది. ఆ మూవీ మరల పెట్టాలెక్కే సూచనలు లేవు. ఆండ్రియా డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడాను. పలువురు హీరోయిన్స్ కి ఆమె గొంతు అరువు ఇచ్చింది. ఆండ్రియా వివాదాలతో స్టార్ కాలేకపోయింది.