ఉగాది రోజున మెగాస్టార్ సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెల్సిందే. చిరు ఎంట్రీతో అభిమానులు ఆయనకు ‘వెల్ కమ్ టూ సోషల్ మీడియా’ అంటూ లక్షల్లో కామెంట్లు పెట్టారు. సెలబ్రెటీలు ఆయన ఘనంగా స్వాగతం పలికారు. మెగా కోడలు ఉపాసన ‘వెల్ కమ్ టూ మామయ్య’ అంటూ ట్వీట్ చేసి అందరినీ ఆకట్టుకుంది.
తాజాగా కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మెగాస్టార్ కు స్వాగతం పలుకుతూ ‘వెల్ కం మిత్రమా.. అని ట్వీట్ చేశారు. దీనికి మెగాస్టార్ స్పందిస్తూ ‘థాంక్యూ మిత్రమా.. రాననుకున్నవా.. రాలేననుకున్నవా’ అంటూ అంటూ ఇంద్ర సినిమాలోని డైలాగ్ ని పోస్ట్ చేశారు. ఈ కామెంట్ వీరిద్దరి మధ్య సాన్నిహిత్యానికి అద్ధం పడుతోంది. సినిమాల్లోనే కాకుండా వీరిద్దరు బయటకుండా చాలా సరదాగా ఒకరిపై ఒకరు కామెంట్ చేసుకుంటూ అభిమానులు అలరిస్తుంటారు. తాజాగా సోషల్ మీడియాలో ఈ ట్రెండ్ కొనసాగడంతో అభిమానులు ఖుషీ అవుతున్నారు.
అదేవిధంగా చిరంజీవి సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చిన రోజునే రాంచరణ్ కూడా ట్వీటర్ ఖాతా తెరిచారు. దీంతో చిరంజీవి చరణ్‌కు స్వాగతం చెబుతూ ఓ ఆసక్తికర కామెంట్ చేశారు. ‘ట్విట్టర్ ప్రపంచంలోకి రామ్ చరణ్‌కు స్వాగతం అంటూనే.. సింహాన్ని దాని పిల్ల ఫాలో అవుతుంది’ కామెంట్ చేశారు. ఈ కామెంట్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. దీంతో చిరంజీవి ట్వీట్‌ను మెగా అభిమానులు అందరికీ షేర్ చేస్తూ ఆనందాన్ని పంచుకుంటున్నారు.