Dil Raju: ఆ సినిమా ప్లాప్ అవుతుందని చిరంజీవి ముందే చెప్పారు, కానీ నేనే వినలేదు : దిల్ రాజు…

వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.ఇక ఇలాంటి క్రమం లోనే దిల్ రాజు ఒకప్పుడు వరుసగా సినిమాలను చేస్తూ సక్సెస్ చేసుకున్నాడు.ముఖ్యంగా దిల్ రాజు స్టోరీ విషయంలో చాలా క్లియర్ గా ఉంటాడు.

Written By: Gopi, Updated On : November 23, 2023 12:27 pm

Producer Dil Raju

Follow us on

Dil Raju: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రొడ్యూసర్ లలో దిల్ రాజు ఒకరు. ఈయన మొదట చిన్న చిన్న సినిమాలను నిర్మిస్తూ మంచి విజయాలను అందుకున్నారు.ఆ తర్వాత భారీ సినిమాలను ప్రొడ్యూస్ చేసే స్థాయికి ఎదిగాడు. ఇక ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ది టాప్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు.ఇక ఇలాంటి క్రమం లోనే దిల్ రాజు ఒకప్పుడు వరుసగా సినిమాలను చేస్తూ సక్సెస్ చేసుకున్నాడు.ముఖ్యంగా దిల్ రాజు స్టోరీ విషయంలో చాలా క్లియర్ గా ఉంటాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే జోష్ సినిమాని మొదటగా దిల్ రాజు రామ్ చరణ్ తో చేద్దామని అనుకొని రామ్ చరణ్ కి కథ కూడా చెప్పాడు. కానీ అప్పుడు రామ్ చరణ్ ఆ కథ విని చాలా ఎక్సైట్ అయ్యాడు. ఇక అదే ఊపులో దిల్ రాజు ఈ సినిమా డైరెక్టర్ అయిన వాసు వర్మ ఇద్దరూ కలిసి చిరంజీవి గారికి ఒకసారి నరేశన్ ని ఇచ్చారు. ఆ కథను విన్న చిరంజీవి దాంట్లో చాలా ఫ్లాస్ ఉన్నాయి అని చెప్పాడు కానీ అప్పటికి దిల్ రాజుకి ఏమీ అర్థం కాలేదు. ఇందులో ఏం ఫ్లాస్ ఉన్నాయి స్టోరీ చాలా బాగుంది కదా అని తనకు తాను అనుకున్నాడు.ఇక చిరంజీవి నాగబాబుకి ఈ కథ చెప్పమని చెప్పగా దిల్ రాజు నాగబాబుకి కథ చెప్పగా నాగబాబు కూడా ఈ సినిమాలో కొన్ని ప్లాస్ ఉన్నాయని చెప్పాడు దాంతో దిల్ రాజు కి ఏం అర్థం కాలేదు.

అప్పటికే ఆరు సినిమాలు తీసి హిట్టు కొట్టి ఉన్నా దిల్ రాజు ఇంత మంచిగా ఉన్న స్టోరీ ని వీళ్ళు ఎందుకు బాలేదు అంటున్నారో నాకు అర్థం కావట్లేదు అని తనకు తాను అనుకొని ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టి చూపిస్తాను అని డైరెక్ట్ గా నాగార్జున గారి దగ్గరికి వెళ్లి ఆ కథ చెప్పి నాగ చైతన్యతో జోష్ సినిమా చేయడానికి ఒప్పించారు.ఇక నాగ చైతన్య హీరో పెట్టీ ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని సినిమాను రిలీజ్ చేశారు దాంతో ఈ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా విషయంలో దిల్ రాజు చేసిన తప్పు ఏంటో తెలుసుకున్నాడు.

అలా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు ఇదంతా చెప్పాడు.ఇక జోష్ సినిమా చూడడానికి చాలా బాగుంటుంది కానీ ఎక్కడో ఏదో చిన్న మిస్టేక్ జరగడం వల్ల ఈ సినిమా అనేది ఫ్లాప్ అయింది. కానీ తీసి పారవేసెంత సినిమా అయితే కాదు చూడడానికి అయితే సినిమా సూపర్ గా ఉంటుంది…