Chiranjeevi: సరిగ్గా మూడేళ్ళ క్రితం టాలీవుడ్ తీవ్రమైన సంక్షోభం లో ఉంది. ఒకపక్క కరోనా కారణంగా షూటింగ్స్ మొత్తం ఆగిపోయాయి. మరో పక్క విడుదల అవుతున్న సినిమాలు ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వడం లేదు. వీటికి అదనంగా అప్పటి సీఎం జగన్ టికెట్ రేట్స్ ని భారీగా తగ్గిస్తూ జీవోలు జారీ చేయడం, ఆ కారణం చేత సూపర్ హిట్ సినిమాలకు కూడా అతి తక్కువ వసూళ్లు నమోదై బ్రేక్ ఈవెన్ మార్కుని కూడా అందుకోలేకపోవడం వంటివి జరిగాయి. ఇక సినీ కార్మికులు అయితే పూట కూడా గడవక అష్టకష్టాలు పడ్డారు. సరిగ్గా అలాంటి సమయం లో మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) చొరవ తీసుకొని అప్పటి సీఎం జగన్ ని మహేష్ బాబు(Superstar Mahesh Babu), ప్రభాస్(Rebel Star Prabhas) మరియు రాజమౌళి(SS Rajamouli) వంటి వారిని తనతో పాటు తీసుకొని వెళ్లి జగన్ తో చర్చాలు జరిపాడు. ఆరోజుల్లో ఈ ఘటన పెద్ద సెన్సేషన్ అయ్యింది.
చిరంజీవి ఇండస్ట్రీ కష్టాలను వివరిస్తూ, దయచేసి టికెట్ రేట్స్ పెంచమని జగన్ ని దయనీయంగా రేఖ్యెస్ట్ చేస్తూ చేతులెత్తి రిక్వెస్ట్ చేయడం, ఆ వీడియో సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అవ్వడం, మెగాస్టార్ అంతటి వాడు చేతులెత్తి దండం పెడుతుంటే జగన్ రియాక్షన్ ని చూసి మెగా ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. కర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్టు, 2024 ఎన్నికల్లో వైసీపీ అంత ఘోరంగా ఓడిపోవడానికి ఇది కూడా ఒక కారణం అని అనేవాయారు విశ్లేషకులు. అయితే అప్పటి వీడియో లో ఎవ్వరూ గమనించని ఒక చిన్న షాట్ ఇప్పుడు సోషల్ మీడియా లో లీకై బాగా వైరల్ అయ్యింది. ప్రభాస్ ముఖ్యమంత్రి కి కృతఙ్ఞతలు తెలుపుతున్న సమయం లో వెనుక ఉన్న చిరంజీవి మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది.
ఈ వీడియో లో చిరంజీవి ‘జోకులు వేస్తే ఒక్కొక్కడికి పగిలిపోతాది’ అని అంటాడు. ఇది అక్కడే ఉన్నటువంటి అప్పటి సినిమాటోగ్రఫీ మినిస్టర్ పేర్ని నాని ని ఉద్దేశించి మాట్లాడాడా?,లేదా మహేష్ బాబు, రాజమౌళి మాట్లాడుకుంటూ జోకులు వేసుకుంటే వాళ్ళని చూసి ఈ మాట అన్నాడా అనేది తెలియాల్సి ఉంది. చిరంజీవి కి ఇండస్ట్రీ లో ప్రతీ ఒకరితో ఎంతో చనువు ఉంది. ముఖ్యంగా మహేష్ బాబు, ప్రభాస్ వంటి వారు ఆయనకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాంటోళ్ళు. కాబట్టి వాళ్ళతో సరదాగా అలా మాట్లాడి ఉండొచ్చని సోషల్ మీడియా లో నెటిజెన్స్ అంటున్నారు. మరికొంత మంది అయితే సోషల్ మీడియా లో ఎవరైనా ఈ సంఘటన గురించి జోకులు వేస్తే ఒక్కొక్కడికి పగిలిపోతాది అని ఉండొచ్చని అంటున్నారు. సోషల్ మీడియా లో బాగా వైరల్ అయిన ఈ వీడియో ని మీరు కూడా చూసేయండి.