Bigg Boss 9 Telugu: చూస్తూ ఉండగానే ఈ సీజన్ బిగ్ బాస్(Bigg Boss 9 Telugu) చివరి దశకు చేరువగా వచ్చేసింది. ఈ సీజన్ ఎక్కువగా టాస్కులు, గొడవలు కంటే ఎమోషన్స్ కి ప్రాధాన్యత ఇచ్చింది. అందుకే ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవ్వడం వల్ల టీఆర్ఫీ రేటింగ్స్ అదిరిపోయాయి. అయితే ఈ సీజన్ టైటిల్ విన్నర్ ఎవరు అనే దానిపై సోషల్ మీడియా లో పెద్ద ఎత్తున చర్చలు నడుస్తున్నాయి. ప్రస్తుతానికి అయితే తనూజ అందరికంటే అత్యధిక ఓటింగ్ తో నెంబర్ 1 స్థానం లో కొనసాగుతోంది. కానీ ఈమధ్య కాలం లో రెండవ స్థానం లో ఉన్న పవన్ కళ్యాణ్ కి వరుసగా పాజిటివ్ ఎపిసోడ్స్ పడుతుండడం వల్ల టైటిల్ రేస్ కి చాలా దగ్గరగా వస్తున్నాడు. దానికి తోడు తనూజ గత వీకెండ్ ఎపిసోడ్స్ విపరీతంగా నెగిటివ్ అయ్యింది. ఇది కూడా కళ్యాణ్ ని టైటిల్ రేస్ కి మరింత దగ్గరగా చేసింది.
అయితే ఈ వారం మాత్రం టైటిల్ విన్నర్ ని నిర్ణయించే వారం అని చెప్పొచ్చు. ఎందుకంటే నేటి నుండి ఫ్యామిలీ ఎపిసోడ్స్ టెలికాస్ట్ కానుంది. నేటి ఎపిసోడ్ లో డిమాం పవన్ తల్లి, తనూజ చెల్లి మరియు సుమన్ శెట్టి సతీమణి హౌస్ లోకి రానున్నారు. ఇప్పటి వరకు తనూజ చెల్లి, సుమన్ శెట్టి సతీమణి హౌస్ లోకి అడుగుపెట్టిన ప్రోమోలు వచ్చాయి. రెండు ప్రోమోలు కూడా ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి ప్రభావం చూపించేలా అనిపిస్తున్నాయి. కంటెస్టెంట్స్ అందరూ ఈ వారం ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుతారు, ఓటింగ్ కూడా చాలా బలంగా పడే అవకాశం ఉంది. కానీ తనూజ కి మాత్రం బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే ఈమె కెప్టెన్ అవ్వడం వల్ల ఈ వారం నామినేషన్స్ లో లేదు. కాబట్టి ఫ్యామిలీ ఆడియన్స్ ఈమెకు ఓటింగ్ వేసే అవకాశం కోల్పోయారు.
విన్నింగ్ రేస్ లో ఉన్న ఒక కంటెస్టెంట్ ఫ్యామిలీ వీక్ లో నామినేషన్స్ లో లేకపోవడం పెద్ద మైనస్ అనే చెప్పాలి. అదే సమయం లో కళ్యాణ్ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ చాలా ఎమోషనల్ గా ఉంటుంది అనే విషయం తెలిసిందే. ఇప్పుడు కళ్యాణ్ తల్లి హౌస్ లోకి వచ్చినప్పుడు ఎమోషన్స్ ఒక రేంజ్ లో క్లిక్ అయ్యి ఓటింగ్ కనీవినీ ఎరుగని రేంజ్ లో పడే అవకాశాలు ఉన్నాయి. ఒక్కసారి ఆడియన్స్ బలంగా ఒక కంటెస్టెంట్ కి కనెక్ట్ అయితే ఆ కంటెస్టెంట్ ని టైటిల్ విన్నర్ ని చేస్తారు. కాబట్టి ఈ వారం నుండి టాప్ 5 లో పవన్ కళ్యాణ్ మొదటి స్థానం లో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీనిని అనుసరిస్తూ మరో పాజిటివ్ ఎపిసోడ్ పడితే మాత్రం పవన్ కళ్యాణ్ టైటిల్ విన్నర్ అయ్యేందుకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.