Megastar Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ఆచార్య రిలీజ్ కి దగ్గర పడటంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ హడావుడి మొదలైపోయింది. ఆచార్యను సూపర్ హిట్ చేయడానికి అభిమానులు సన్నద్ధం అవుతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ కూడా వరుస ప్రమోషన్స్ లో ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా చిరు తన తర్వాత చిత్రాల పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
Megastar Chiranjeevi
ఆ కామెంట్స్ ఏమిటో చిరు మాటల్లోనే.. ‘ప్రస్తుతం నా చేతిలో ఐదు సినిమాలు ఉన్నాయి. అందరికి ఇది తెలుసు. కానీ.. మీకు తెలియని మరో విషయం ఏమిటంటే.. నా కోసం మరో ఐదు కథలు కూడా రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం జరుగుతున్న ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ కోసం రాత్రివేళల్లో పని చేశాను. అలాగే బాబీతో చేస్తున్న చిత్రానికి కూడా నైట్ టైమ్ లోనే పని చేశాను.
Also Read: Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినీ కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ ఇవే !
అంతగా నేను పని చేసినా.. నేను అస్సలు అలసటగా ఫీలవలేదు. నాలో మరింత ఉత్సాహం వచ్చింది’ అంటూ చిరు చెప్పుకొచ్చారు. మరి మరో ఐదు కథలు రెడీ అవుతున్నాయని చిరు చెప్పడం ఇప్పుడు అందర్నీ షాక్ కి గురి చేసింది. అసలు చిరు అన్నీ సినిమాలు ఎలా చేస్తాడు ? చూడాలి. ప్రస్తుతానికి వచ్చే నెల నుంచి మెహర్ రమేష్ తో మెగాస్టార్ చేస్తున్న తమిళ సినిమా ‘వేదాళం’ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నాడు.
Megastar Chiranjeevi
ఆ తర్వాత చిరంజీవి హీరోగా, దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రానున్న యాక్షన్ థ్రిల్లర్ లో చిరు నటించనున్నారు. జులై నుంచి ఈ సినిమా షూట్ ను స్టార్ట్ చేయనున్నారు. ఏది ఏమైనా కాలం మారినా, తరాలు మారినా మెగాస్టార్ లో ఇప్పటికీ అదే కోలాహలం, అదే ఉత్సాహం కనిపించడం నిజంగా విశేషమే.
అన్నట్టు ఆచార్యలో చరణ్ పాత్ర ఎంతసేపు ఉంటుంది ? ఆచార్యలో చరణ్ పాత్ర నిడివి సుమారు 24 నిమిషాలు ఉండబోతుంది. చిరు – చరణ్ మధ్య ఉండే సన్నివేశాలు ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్ మెంట్ అందిస్తాయట. ఏప్రిల్ 29న సమ్మర్ కానుకగా థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం రన్ టైం సుమారు 2 గంటల 58 నిమిషాలు ఉండేలా కొరటాల ప్లాన్ చేశాడు.
Also Read:AP Govt Schools: ‘భరత్ అనే నేను’.. మహేష్ లా.. సీఎం జగన్ సాధించాడు..
Recommended Videos: