Chiranjevi Disaster Movie: కొన్ని ఫ్లాప్ అవ్వడానికి కారణాలు ఏమిటో మనకి అంతు చిక్కవు..మంచి కథా, కథనం మరియు భారీ తారాగణం ఉన్నప్పటికీ కూడా అట్టర్ ఫ్లాప్ అయినా సినిమాలు మన టాలీవుడ్ లో ప్రతి స్టార్ హీరో కి ఉన్నాయి..అలా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కూడా వేట అనే సినిమా ఉంటుంది..’ది కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో’ అనే పేరుతో ఫ్రెంచ్ లో అలెగ్జాండర్ డ్యూమాస్ రాసిన నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాడు ఆ చిత్ర దర్శకుడు కోదండరామి రెడ్డి..ఇందులో అభం శుభం తెలియని ఒక్క అమాయుకుడిపై అక్రమ నేరాలు అంటగట్టి అండమాన్ నికోబర్ దీవుల్లో కఠిన జైలు శిక్ష ని అమ్మాయలు అయ్యేలా చేస్తారు విలన్స్..అండమాన్ నికోబర్ దీవుల్లో హీరో కి పరిచయం అయ్యి మంచి స్నేహితుడు అయినా ఒక్క వ్యక్తి, తానూ చనిపొయ్యే ముందు తన దగ్గర ఉన్న నిధి కి సంబంధించిన దారి ని హీరో కి చెప్పి చనిపోతాడు..ఆ తర్వాత జైలు శిక్ష ని పూర్తి చేసుకున్న హీరో బయటికి వచ్చిన తర్వాత ఆ నిధిని సొంతం చేసుకొని కోటీశ్వరుడు అవుతాడు..గొప్ప ధనవంతుడు అయినా తర్వాత తన జీవితం ని నాశనం చేసిన విలన్స్ ని చిత్రహింసలు పెట్టి సంపుటాడు హీరో.
Also Read: Divyavani: బాలకృష్ణ కంటే నేనే పెద్ద హీరోను… ఫైర్ బ్రాండ్ దివ్యవాణి షాకింగ్ కామెంట్స్
కథ మరియు స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉన్నప్పటికీ కూడా ఈ సినిమా ఆ రోజుల్లో భారీ ఫ్లాప్ అయ్యింది..దానికి కారణం భారీ అంచనాల నడుమ విడుదల అవ్వడమే..అప్పట్లోనే సుమారు కోటి రూపాయలతో ఈ సినిమాని తెరకెక్కించారు..అప్పట్లో కోటి రూపాయిల బడ్జెట్ అంటే మాములు విషయం కాదు..ఇప్పటి లెక్కలతో పోలిస్తే వంద కోట్ల రూపాయలతో సమానం..ఈ సినిమా ని చిరంజీవి ఎంతో ఇష్టపడి చేసాడు..సుమారు 60 రోజుల పాటు చిరంజీవి ఈ సినిమా కోసం పని చేసాడు..ఫ్లాప్ అయ్యినప్పుడు చిరంజీవి చాలా బాధపడరు అట..ఇది కాసేపు పక్కన పెడితే ఈ సినిమాని తియ్యడానికి ఆధారమైన ‘ది కౌంట్ ఆఫ్ మాంటి క్రిస్టో’ అనే నవల అంటే నందమూరి బాలకృష్ణ కి ఎంతో ఇష్టం అట..అప్పట్లో ఈ నవలని ఆధారంగా తీసుకొని ఫ్రెంచ్ లో చాలా సినిమాలే వచ్చాయి అట..బాలయ్య ఆ సినిమాలు అన్ని చూసి తాను కూడా ఇక్కడ ఆ కథాంశం తో సినిమా చేస్తే చాలా బాగుంటుంది అనుకున్నాడు అట..చాలా మంది దర్శక నిర్మాతలతో కూడా చర్చించాడు..కానీ ఎందుకో ఈ సినిమా కార్య రూపం దాల్చలేదు..అదే నావా కోదండ రామి రెడ్డి కి కూడా నఃకాడం..ఆయన చిరంజీవి తో వేట సినిమా తియ్యడం యాదృచ్చికం అనే చెప్పాలి..కమర్షియల్ గా ఈ సినిమా ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా..చిరంజీవి అభిమానులకు ఈ సినిమా అంటే బాగా ఇష్టం అనే చెప్పాలి.
Also Read: Koratala Siva- Ram Charan: కొరటాల కి రామ్ చరణ్ మరో చాన్స్..భయపడిపోతున్న ఫాన్స్