CM KCR- Telangana Formation Day: తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ వేడుకలు పబ్లిక్ గార్డెన్ లో నిర్వహిస్తున్నారు. సీఎం కేసీఆర్ తమ చేతలతో రాష్ట్రాన్ని ఎంతో ఎత్తుకు తీసుకెళ్లామని చెబుతున్నారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి పాతాళంలోకి పడిపోయింది. దీంతో పూట గడవని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడే మార్గాలు కనిపించడం లేదు. కానీ కేసీఆర్ మాత్రం తమది ధనిక రాష్ట్రమని చెబుతూ రాష్ర్ట ఆర్థిక పరిస్థితులను మాత్రం పట్టించుకోవడం లేదు.
ఎనిమిదేళ్లలో రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నిలిపామని చెప్పుకుంటున్నా రాష్ట్రంలో ఆర్థిక వెసులుబాటు ఎలాగో కూడా తెలియడం లేదు. ఈ క్రమంలో రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తోందే కానీ అసలు పరిస్థితిని మాత్రం తెలపడం లేదు. దీంతోనే ఆర్థిక సమస్యలను గట్టెక్కడం అంత సులువు కాదని తెలిసినా కేంద్రంతో పెట్టుకుని కనీసం అప్పు కూడా పుట్టకుండా చేసుకుంది. దీంతోనే ఉద్యోగులకు సరైన సమయంలో వేతనాలు కూడా ఇవ్వలేకపోతోంది. అయినా మాది ధనిక రాష్ట్రమని చెప్పుకుంటోంది.
Also Read: Farmer Suicides in Telangana: ఆవిర్భావ సంబరం సరే.. ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానం సంగతేంటి?
ఒకవేళ ధనిక రాష్ట్రమే అయితే అప్పు ఎందుకు అవసరమనే ప్రశ్నలు వస్తున్నాయి. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా మారింది పరిస్థితి. అయినా సీఎం కేసీఆర్ మాత్రం ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకునేందుకు ముందుకు రావడం లేదు. దీంతో కేంద్రం అప్పు ఇచ్చేందుకు కొర్రీలు పెడుతుండటంతో ఇక ఏం చేయాలో అర్థం కావడం లేదు. కానీ అప్పు పుట్టకపోతే మనుగడ ప్రశ్నార్థకమే. ఇవన్నీ తెలిసినా ఎందుకు కేసీఆర్ ప్రధానితో పెట్టుకోవడం అనే ప్రశ్నలు వస్తున్నాయి.
తమ పని తాము చేసుకుపోయే అవకాశాలున్నా అనవసరంగా కేంద్రంతో పెట్టుకుని ఇప్పుడు కష్టాలు కొనితెచ్చుకున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి కేసీఆర్ మొండి వైఖరే ఆయనకు కష్టాలు తెస్తోందని తెలుస్తోంది. రాష్ట్ర అవతరణ వేడుకలు జరుపుకుంటూ తాము ఇది చేశామని అది చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారే కానీ అభివృద్ధిపై మాత్రం దృష్టి పెట్టడం లేదు. ఫలితంగా ఖజానా ఖాళీ అయిపోవడంతో ఇక మనుగడ ఎలాగనే సందేహాలు వస్తున్నాయి.
మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి తాగునీరు, మిషన్ కాకతీయతో సాగునీరు, ప్రాజెక్టులతో జలాశయాల కళకళ అంటూ ఉపన్యాసాలతో ఊదరగొడుతున్నారు. ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కే పనులు మాత్రం చేయడం లేదు. దీంతో రాబోయే కాలంలో ప్రభుత్వానికి సమస్యలే వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.