Bandi Sanjay: తెలంగాణలో మరోసారి మత విద్వేషాలు రలుగుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ నేత రషీద్ ఖాన్ భాగ్యలక్ష్మి ఆలయం వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టడాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యలక్ష్మి ఆలయం దగ్గర ఏదైనా గొడవ జరిగితే దానికి కారణం కాంగ్రెస్ అవుతుందని చెబుతున్నారు. అసలు రాష్ర్టంలో కాంగ్రెస్ బతికుందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మత విద్వేషాలు రెచ్చగొడుతుంది ఎవరో తెలుస్తుందని విమర్శిస్తున్నారు.

బీజేపీ ఏ కార్యక్రమం చేపట్టినా పాతబస్తీలోని భాగ్యలక్ష్మి ఆలయం నుంచి ప్రారంభిస్తోంది. బండి సంజయ్ రెండు దఫాలుగా పాదయాత్ర చేరపట్టగా మొదటి సారి భాగ్యలక్ష్మి దేవాలయం నుంచే పాదయాత్ర ప్రారంభించారు. అందుకే అది ఓ సెంటిమెంట్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కూడా అక్కడి నుంచి సంతకాల సేకరణ చేపట్టాలని బావించడంతో బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. రషీద్ ఖాన్ చర్యలను ఖండిస్తున్నారు. ఆయనపై సుమోటాగా కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మత చాందస వాదులు ఎవరో తెలుస్తోందని వ్యాఖ్యానించారు.
Also Read: CM KCR- Telangana Formation Day: ఓవైపు డబ్బుల కటకట.. మరోవైపు కేసీఆర్ పొగడ్తల వర్షం
హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రవర్తిస్తే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు. రాష్ర్టంలో పరిపాలన గాడితప్పుతోందని పేర్కొంటున్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం దొంగ నాటకాలు ఆడుతూ ప్రజలను మోసం చేయానలి చూస్తున్నాయని దుయ్యబడుతున్నారు. ఎవరు ఎన్ని చేసినా చివరకు రాష్ట్రంలో అధికారం చేపట్టడం మాకే చెల్లుతుందని మరోసారి ప్రకటిస్తున్నారు. అధికార పార్టీ టీఆర్ఎస్ ఎంఐఎంకు అమ్ముడుపోయిందని ఎద్దేవా చేస్తున్నారు.

మొత్తానికి బండి సంజయ్ ఇదే అంశంపై పోరాడాలని చూస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ పై నిప్పులు చెరుగుతున్న ఆయన రషీద్ ఖాన్ వ్యవహారాన్ని తమకు అనుకూలంగా మలుచుకోవాలని చూస్తున్నారు. ప్రజల్లో రగులుతున్న భావాలకు ఆచరణ రూపం కల్పించి మరోమారు టీఆర్ఎస్, కాంగ్రెస్ లను దెబ్బతీయాలని వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. రాష్ర్ట రాజకీయాలను శాసించే విధంగా తమ పార్టీ ఉనికికి గుర్తించేలా చేయాలని ఉబలాటపడుతున్నారు దీని కోసమే ప్రణాళికలు రచిస్తున్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ లను ఎండగట్టి వాటికి సరైన గుణపాఠం చెప్పేందుకు సిద్ధమవుతున్నారు.
Also Read:Farmer Suicides in Telangana: ఆవిర్భావ సంబరం సరే.. ఆత్మహత్యల్లో తెలంగాణ అగ్రస్థానం సంగతేంటి?


