Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రానున్న ఆచార్య సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధమైంది. ఆ తర్వాత మోహన్ రాజా దర్శకత్వంలో గాడ్‌ఫాదర్, మెహర్ రమేశ్‌తో భోళా శంకర్, బాబీతో కలిసి మరో సినిమాకు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇలా వరుస షెడ్యూల్స్‌తో ఫుల్ బిజీగా మారిపోయారు చిరు.
అయితే, తాజాగా ఓ ప్రముఖ అవార్డుల కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన చిరు.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి అవార్డులు నటులకు ఇవ్వాలనే తపన మనసులో బలంగా ఉంటేనే ఏదైనా సాధించగలం అని అన్నారు. కళాకారులకు అవార్డులు ఓ గొప్ప ఉత్సాహాన్ని ఇస్తాయని.. అటువంటి అవార్డు వేడుకలను ప్రభుత్వం నిర్వహిస్తే బాగుంటుందని అన్నారు. ప్రభుత్వమే సినిమా కళాకారులకు అవార్డులతో సత్కరించాలని పేర్కొన్నారు. అయితే, రాష్ట విభజన తర్వాత.. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ అవార్డు వేడుదల విషయం పూర్తిగా మర్చిపోయినట్లు కనిపిస్తోందని అన్నారు. ఇకనైనా ఆలోచించి ఈ అవార్డు ప్రదాన కార్యక్రమాలు నిర్వహిస్తే మంచిదని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు చిరు.
ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఆచార్య సినిమాలో చిరు సరికొత్తగా కనిపించనున్నారు. ఇందులో రామ్‌చరణ్ కూడా నటిస్తున్నారు. మవోయిస్టు నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4న ఈ సినిమా విడుదల కానుంది. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.