AP High Court: బ్రేకింగ్: ఏపీలో 8మంది ఐఏఎస్ లకు జైలు శిక్ష

AP High Court: చేతిలో అధికారముంది కదా అని ఇష్టారాజ్యంగా పాలిస్తామంటే కుదరదు. ప్రభుత్వ పెద్దలు చెప్పారనో.. వారి ప్రాపం కోసమో..వారి అడుగులకు మడుగులొత్తి ప్రజాధనం దుర్వినియోగం చేస్తామంటే అధికారులు కోర్టు బోనులో నిలవాల్సిందే. మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రజాధనం ఖర్చు విషయంలో కోర్టు తీర్పును బేఖాతరు చేసి.. న్యాయస్థానాన్ని ధిక్కరించిన ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ లపై ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పు అధికార గణానికి గట్టి హెచ్చరికగా మిగిలిందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. దేశంలో బ్యూరోక్రసి […]

Written By: Admin, Updated On : March 31, 2022 1:58 pm

Ticket prices issue

Follow us on

AP High Court: చేతిలో అధికారముంది కదా అని ఇష్టారాజ్యంగా పాలిస్తామంటే కుదరదు. ప్రభుత్వ పెద్దలు చెప్పారనో.. వారి ప్రాపం కోసమో..వారి అడుగులకు మడుగులొత్తి ప్రజాధనం దుర్వినియోగం చేస్తామంటే అధికారులు కోర్టు బోనులో నిలవాల్సిందే. మూల్యం చెల్లించుకోవాల్సిందే. ప్రజాధనం ఖర్చు విషయంలో కోర్టు తీర్పును బేఖాతరు చేసి.. న్యాయస్థానాన్ని ధిక్కరించిన ఎనిమిది మంది సీనియర్ ఐఏఎస్ లపై ఏపీ హైకోర్టు వెలువరించిన తీర్పు అధికార గణానికి గట్టి హెచ్చరికగా మిగిలిందనడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. దేశంలో బ్యూరోక్రసి వ్యవస్థ ఔన్నత్యాన్ని గుర్తుచేస్తూ న్యాయస్థానం ఇచ్చిన విలక్షణమైన తీర్పు సర్వత్రా చర్చనీయాంశమైంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత సచివాలయ వ్యవస్థను ప్రారంభించిన సంగతి తెలిసిందే. పంచాయతీల స్థానంలో గ్రామాల్లో కొత్తగా సచివాలయ భవనాలను నిర్మించారు. కానీ చాలా చోట్ల కనీస నిబంధనలు పాటించలేదు.

AP High Court

ప్రభుత్వ పాఠశాలల సమీపంలో, ప్రభుత్వ స్థలాల్లో ఇష్టారాజ్యంగా నిర్మించారు. దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. దీనిపై పలుమార్లు విచారించిన కోర్టు అభ్యంతరం తెలిపింది. ప్రభుత్వ తీరును తప్పు పట్టింది. వెంటనే వాటిని తొలగించాలని ఆదేశించింది. కానీ ప్రభుత్వ పెద్దలు ఆదేశాలతోనో.. వారిచ్చిన భరోసాతోనో.. న్యాయస్థానాలు ఏంచేయవన్న భావనతోనే అధికారులు ఈ నిర్మాణాలను తొలగించలేదు.

Also Read: CM KCR: కేసీఆర్ లో టెన్ష‌న్ మొద‌లైందా.. ప‌ర్‌ఫెక్ట్ నిర్ణ‌యం తీసుకోలేక‌పోతున్నారా..?

దీనిపై గురువారం విచారణ చేపట్టిన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సంచలనాత్మక తీర్పునిచ్చింది. కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన ఎనిమిది మంది ఐఏఎస్‌లకు జైలు శిక్ష విధిస్తూ ధర్మాసనం తీర్పునిచ్చింది. అయితే హైకోర్టుకు ఎనిమిది ఐఏఎస్‌ అధికారులు బేషరతుగా క్షమాపణలు చెప్పారు. పొరపాటు అయ్యిందని, భవిష్యత్తులో ఇలాంటివి పునావృతం కాకుండా చూస్తామని తెలిపారు. ఐఏఎస్‌ల క్షమాపణలను అంగీకరించిన హైకోర్టు… జైలుశిక్షకు బదులుగా ఏడాది పాటు ప్రతినెలలో ఒకరోజు సంక్షేమ హాస్టల్‌కు వెళ్లి సేవ చేయాలని ఆదేశించింది. ఏడాది పాటు సంక్షేమ హాస్టల్‌లో ఒక్కపూట భోజనం పెట్టాలని పేర్కొంది. ఈ మేరకు సీనియర్ ఐఏఎస్‌లు విజయ్‌కుమార్, శ్యామలరావు, గోపాలకృష్ణ ద్వివేది, బుడితి రాజశేఖర్‌, శ్రీలక్ష్మి, గిరిజాశంకర్‌, వాడ్రేవు చినవీరభద్రుడు, ఎంఎం నాయక్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే కుదరదు

 

AP High Court

ప్రజలు తమకు అయిదేళ్ల పాటు అధికారం ఇచ్చారు. తిరుగులేని మెజార్టీ కట్టబెట్టారు. మేము పాలన అందిస్తాం. అందులో జ్యుడీషియల్ జోక్యమేమిటి? రాజధాని అన్నది మా ఇష్టం. ఒకే రాజధాని అన్న మాట రాజ్యాంగంలో ఎక్కడా లేదు కదా? అలాంటప్పుడు అనవసర జోక్యాలేందుకు? శాసన సభలో జ్యుడిషియల్ జోక్యంపై గంటల తరబడి చర్చ ఇది. సీనియర్ ప్రజాప్రతినిధులు, కీలక శాఖలకు మంత్రులుగా వ్యవహరించిన వారు తమ అనుభవాలను రంగరించి మరీ ఈ చర్చలో కీలక వక్తలుగా మాట్టాడారు. పరిధులు దాటారని..తామే పరిధి దాటి వ్యవహరించారు.

వాస్తవానికి వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వానికి న్యాయస్థానాల నుంచి మొట్టికాయలు పడుతునే ఉన్నాయి. దీంతో అధికార పక్షానికి కోర్టులు ప్రధాన ప్రతిపక్షాలుగా కనిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు, రకరకాల కామెంట్లతో హోరెత్తించారు. దీనిపై కూడా విచారణ సాగుతున్న తరుణంలో శాసనసభలో చర్చ సాగింది. అయితే విద్యాధికులైన కొందరు అధికారులు కూడా ప్రభుత్వ ఉచ్చులో పడుతున్నారు.

నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. చివరకు కోర్టు బోనులో నిల్చుంటున్నారు. తొలుత ప్రభుత్వ భవనాలకు అధికార పార్టీ రంగులపై కోర్టు పలుమార్లు హెచ్చరించినా పెడచెవిన పెట్టారు. చివరకే ఆగ్రహం వ్యక్తం చేయడంతో తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వ పాఠశాలల సమీపంలోనే సచివాలయ భవనాలను నిర్మించారు. చాలాచోట్ల అధికార పార్టీ నేతలు బిల్లులు సైతం చేసుకున్నారు. వారంతా భవనం వేరేచోటకు తరలించాలని అధికారులు కోరగా.. ససేమిరా అంటున్నారు. ఇటు కోర్టు కు సమాధానం చెప్పుకోలేక.. అటు భవనాలనే వేరే చోటకు తరలించేందుకు నేతలు సహకరించకపోవడంతో అధికారులు డిఫెన్స్ లో పడిపోయారు. ఈ పర్యవసాన నేపథ్యమే హైకోర్టు సంచలనాత్మక తీర్పు. ఇకనైనా సీనియర్ ఐఏఎస్ అధికారులు తీరు మార్చుకుంటారో లేదో మరీ…

Also Read: AP Cabinet Expansion: ముంచుకొస్తున్న ఏప్రిల్ గండం.. వైసీపికి కౌంట్ డౌన్ ప్రారంభం

Tags