Chiranjeevi-Bramhanamdam Viral Video: గత నాలుగు దశాబ్దాల నుండి మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi), కామెడీ కింగ్ బ్రహ్మానందం(Bramhanandam) కాంబినేషన్ తెలుగు ఆడియన్స్ ని ఏ రేంజ్ లో అలరిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమానే వచ్చింది, అది కూడా ‘ఖైదీ నెంబర్ 150’. వీళ్ళ కాంబినేషన్ ని ఈమధ్య కాలం లో బాగా మిస్ అవుతున్నామే అని అభిమానులు నిరాశపడ్డారు. అలాంటి అభిమానులకు చాలా కాలం తర్వాత వీళ్లిద్దరి కలయిక నవ్వులు పూయించింది. కానీ ఈ అరుదైన ఘటన జరిగింది వెండితెర మీద కాదు, బుల్లితెర మీద. వివరాల్లోకి వెళ్తే రీసెంట్ గానే ఈటీవీ ఛానల్ 30 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, రామోజీ ఫిల్మ్ సిటీ లో ఒక గ్రాండ్ ఈవెంట్ ని ఏర్పాటు చేశారు. ఈ ఈవెంట్ కి మెగాస్టార్ చిరంజీవి, బ్రహ్మానందం తో పాటు, ఎంతో మంది దిగ్గజ నటీనటులు, దర్శక నిర్మాతలు ముఖ్య అతిథులుగా విచ్చేసారు.
ఈ వేడుకని నిన్న గత శని, ఆదివారాల్లో ఈటీవీ ఛానల్ లో టెలికాస్ట్ చేశారు. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ఎంతో మంది అవార్డ్స్ అందుకున్నారు. వారిలో హాస్య బ్రహ్మ బ్రహ్మానందం కూడా ఒకడు. ఆయన స్టేజి మీదకు ఎక్కగానే చిరంజీవి వ్యటకారంగా బ్రహ్మానందం కాళ్లకు దండం పెడుతున్నట్టుగా నమ్మించి తన ప్యాంటుని సర్దుకున్నాడు. ఆమ్మో చిరంజీవి నా కాళ్ళని మొక్కడం ఏంటి అని ఆయన క్రిందకి వంగి ఆపే ప్రయత్నం చేసాడు. అలా వీళ్లిద్దరి మధ్య సాగిన ఈ చిలిపి కామెడీ ప్రేక్షకులను విశేషంగా అలరించింది. ఆ తర్వాత చిరంజీవి చేతిలో అవార్డు ని అందుకొని బ్రహ్మానందం క్రిందకి వెళ్తున్న సమయం లో యాంకర్ సుమ, ఇప్పుడు బ్రహ్మానందం గారి డ్యాన్స్ పెర్ఫార్మన్స్ ఉంది అని అంటుంది.
Also Read: కూలీ ‘సాంగ్ లోని మోనికా’ ఎవరో తెలుసా? ఆమె బ్యాక్ గ్రౌండ్ చూస్తే మెంటలే?
అప్పుడు బ్రహ్మానందం ఆగి వెనక్కి తిరిగి చూస్తాడు. చిరంజీవి వచ్చి డ్యాన్స్ వెయ్యి అని సైగలు చేయడం తో, బ్రహ్మానందం తనదైన స్టైల్ లో నాలుగు స్టెప్పులు వేసి వెళ్తాడు. వీళ్లిద్దరి ఫన్నీ కాంబినేషన్ ని కాసేపు అలా చూస్తూ ఉండిపోయారు అక్కడికి వచ్చిన విశిష్ట అతిథులంతా. బుల్లితెర పై ఈ కాంబినేషన్ ని చూస్తున్న ప్రేక్షకులు, అభిమానులకు కనులపండుగ లాగా అనిపించింది. ఇక చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే, విశ్వంభర చిత్రం పూర్తి అయ్యింది కానీ, ఇంకా గ్రాఫిక్స్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడం తో వచ్చే ఏడాది వేసవి కి ఈ చిత్రాన్ని వాయిదా వేశారు. అదే విధంగా ఆయన అనిల్ రావిపూడి తో చేస్తున్న ‘మన శంకర వరప్రసాద్ గారు’ అనే చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మెగాస్టార్ పుట్టినరోజు నాడు ఈ సినిమాకు సంబందించిన టైటిల్ గ్లింప్స్ ని కూడా విడుదల చేశారు.
Megastar comedy timing ❤️
Megastar Chiranjeevi – Hasya Brahma Bramhanamdam bonding from starting of Brahmanandam journey
Megastar @KChiruTweets #Bramhanamdam #ETV30Years #ETV
— Shiva (@Mygodshiva) August 24, 2025